వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణస్టేట్‌మెంట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 21-05-2005

హైదరాబాద్‌:రాజకీయాలు ఎంత సిగ్గుమాలినవో తెలిపేఉదంతాలివి. అదిగో తెలంగాణతెలంగాణ వచ్చుడో కెసిఆర్‌ సచ్చుడోఅని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన చంద్రశేఖరరావు ఇప్పుడునోరుమెదపడంలేదు. తెలంగాణవ్యవహారాన్ని ప్రణబ్‌ ముఖర్జీయే చూసుకుంటారనిసోనియా గాంధీ చెప్పితప్పుకున్నారు. సోనియాగాంధీ తమకుతెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయిస్తాననిహామీ ఇచ్చినట్టు గతంలో చెప్పుకున్న చంద్రశేఖరరావు,నరేంద్రలకు ఆదెబ్బతో మొహం చెల్లకుండా పోయింది.తెలంగాణ విషయంలో ఎటువంటి పురోగతిసాధించకుండా మరో ఆరు నెలలు మంత్రిపదవుల్లో గడిపితే చంద్రశేఖరరావు,నరేంద్రలనుతెలంగాణ వాదులు చొక్కా పట్టుకుని నిలదీసేఅవకాశముంది. రెండో ఎస్సార్సీకి ఒప్పుకునిఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంఏర్పడి ఉండేదని జి.వెంకటస్వామి అంటారు.తెలంగాణ వచ్చి తీరుతుందని ఇటీవలఒక బహిరంగ సభలో సెలవిచ్చారు. ఎవరిని నమ్మాలి?ఎవరిని నమ్మకూడదు?

సమైక్యాంధ్రకుకట్టుబడి ఉన్న తెలుగుదేశం పార్టీ మరోపక్క టిఆర్‌ఎస్‌ నాయకుల మీద దుమ్మెత్తిపోస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని,చంద్రశేఖరరావుకుతెలుసని, కల్లబొల్లి కబుర్లతో ఆయనకాలం గడుపుకుంటున్నారని ఈ ప్రాంతానికి చెందిన టిడిపినాయకులు దేవేందర్‌గౌడ్‌, కడియం శ్రీహరివిరుచుకుపడుతున్నారు. కెసిఆర్‌మీదకు తెలంగాణకు చెందిన బలహీనవర్గాలనాయకులను రెచ్చగొట్టడం తెలుగుదేశం ఒకవ్యూహం ప్రకారం చేస్తున్నదే.తెలంగాణపై సోనియాగాంధీ కప్పదాటు ధోరణి ప్రదర్శించినప్పటినుంచి ఇకతెలంగాణ రాదులెమ్మనితెలుగుదేశం నాయకులురెచ్చిపోతున్నారు.

తెలంగాణపైకాంగ్రెస్‌ నాయకులది తలొక మాట.రెండో ఎస్సార్సీ తెలంగాణ విషయాన్నితేల్చుతుందని, అధిష్టానవర్గం ఆలోచనకూడా ఇదేనని ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి పదే పదే చెబుతున్నారు. వెంకటస్వామిమాత్రంతెలంగాణ వచ్చి తీరుతుందంటున్నారు.పిసిసి అధ్యక్షుడు కాక ముందుతెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగాప్రకటనలు చేసిన కేశవరావు పదవివచ్చాక తేలుకుట్టిన దొంగ అయ్యారు.ఇక కొందరు రాజకీయ నాయకులు కొత్తడిమాండ్‌ తీసుకొచ్చారు. హైదరాబాద్‌,రంగారెడ్డి జిల్లాలను కలిపి ఒకరాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నది ఆ డిమాండ్‌.పనిలేని రాజకీయ నాయకులుపిల్లితల గొరగడమంటే ఇదేనేమో. వీరిప్రకటనలతో, ప్రతి విమర్శలతో మీడియాసాధనాలు నిండిపోతున్నాయి.

Recent Stories
  • కెసిఆర్‌ ఢిల్లీమంత్రాంగం
  • మామూలై పోయిన మామూళ్ళు!
  • తెలంగాణపై మళ్ళీ దోబూచులాట!
  • తెలంగాణ వచ్చుడో, కెసిఆర్‌ చచ్చుడో
  • తారల ప్రభావం నిల్‌!
  • ఉద్వేగ అంశాలు
  • తారల ప్రభావం నిల్‌!
  • ఇప్పటికిప్పుడు చెరిసగం

  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవి రహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్‌
  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవి రహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X