చంద్రశేఖర్ తెలంగానం లెక్కలు


హైదరాబాద్:టిఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు ఢిల్లీలోతేలుకుట్టిన దొంగలా గమ్మునఉంటున్నారు. వైఎస్‌తో చర్చల దరిమిలాఆయనకు కొంత సమయం చిక్కింది.తెలంగాణపై యుపిఎ సబ్ కమిటీ నివేదికవచ్చేవరకు ఆయనకుటెన్షన్ లేదు. యుపిఎ నివేదికతెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగానివేదిక ఇస్తే చంద్రశేఖరరావు మరోఏడాది హాయిగాకేంద్ర మంత్రి పదవిలో గడిపేయవచ్చు. తెలంగాణపై తుదినిర్ణయం సోనియాగాంధీదే కావడంతోఈలోపు చంద్రశేఖరరావు ఆమెను ఒకటిరెండు సార్లు కలుస్తారు. చంద్రశేఖరరావు ఇప్పట్లోహైదరాబాద్ వచ్చే అవకాశం కూడాలేదు.
టిఆర్‌ఎస్‌నాయకుడు, కేంద్రసహాయ మంత్రిఎ.నరేంద్ర తరచు హైదరాబాద్‌వచ్చి తన శైలిలో వ్యాఖ్యానాలు చేసి వెళ్తున్నారు. విజయశాంతికితెలంగాణపై అవగాహన లేదనిఆయన ఎద్దేవా చేశారు. ఆమెనుతెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకోడానికిప్రయత్నించింది ఆయనే. టిఆర్‌ఎస్‌లో చేరితేఆమెకు తెలంగాణ సమస్యలపైముద్దారా నేర్పిద్దామనుకునిఉండవచ్చు ఆయన. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌నాయకులు కూడాఎప్పటికైనా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితీరాలంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకాంగ్రెస్ ద్వారా జరగాలే కానీ ఆ క్రెడిట్‌టిఆర్‌ఎస్‌కు పోకూడదన్నది వారి అభిమతం.
వచ్చేమునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-టిఆర్‌ఎస్‌లు కలిసి పోటీ చేస్తాయి. ఎవరి బలహీనతలు వారికి ఉన్నాయి కాబట్టి ఒంటరిగాపోటీచేస్తే ఎక్కడ బలహీనతలుబయటపడతాయోనన్నది వారి భయం. మొత్తానికి అదిగో తెలంగాణ రాష్ట్రం, ఇదిగోఅన్న ఉత్కంఠ ఇప్పుడు లేదు. తెలంగాణఅతివాదులు కూడా వేచి చూసే ధోరణిలోఉన్నారు. మరోవైపు కోస్తా ఆంధ్రలోకొత్తరాజధాని పేరిట వేలం వెర్రిగా ఇప్పుడురియల్ ఎస్టేట్ లావాదేవీలు జరగడంలేదు. హైదరాబాద్‌లో ఇళ్ళు, ఇళ్ళస్ధలాలు, ఫ్లాట్ల ధరలు నిలకడగా ఉన్నాయి.అంతర్జాతీయ విమానాశ్రయం వస్తున్నషంషాబాద్, ఇన్‌ఫోసిస్ తదితర ఐటిసంస్ధలున్న గోపన్నపాలెం తదితర చోట్లప్లాట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.
ఇటీవలికథనాలు హోంపేజి తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!