వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయశాంతిహల్‌చల్‌

By Staff
|
Google Oneindia TeluguNews
Vijayashanthiహైదరాబాద్‌:విజయశాంతి విషయంలో భారతీయ జనతా పార్టీ సహనంకోల్పోయింది. బిజెపిలోనే ఉండితెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేయాలనినిర్ణయించుకున్న విజయశాంతినిన్న హైదరాబాద్‌కు మకాం మార్చినవిషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం ఒకసమావేశంలోవిజయశాంతి ప్రసంగించనుందనితెలుసుకున్న బిజెపి నాయకత్వంఆమెను రాజీనామా చేయమని కోరినట్టుతెలిసింది.

విజయశాంతిచుట్టూ ఇప్పుడు వంది మాగధుల ముఠా చేరింది. తెలంగాణసాధనకు ఒకరాజకీయ పార్టీ పెట్టడానికి ఆమె సిద్ధమయ్యారు. టిఆర్‌ఎస్‌, బిజెపిలనుంచి బయటికి వచ్చిన తెలంగాణవాదులతో పాటు కొందరు కాంగ్రెస్‌ యువనాయకులు కూడా విజయశాంతితో కలిశారు.విజయశాంతి వ్యక్తిగత సహాయకుడుప్రసాద్‌ తెరవెనుక ఉండి ఫైనాన్స్‌తదితర వ్యవహారాలు చూసుకుంటున్నారు.

విజయశాంతిసొంతపార్టీ పెడితే టిఆర్‌ఎస్‌కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆమె పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది. జయలలిత లాగాపార్టీ అన్నీ తానే అన్నట్టు వ్యవహరించాలనివిజయశాంతి నిర్ణయించుకున్నట్టుతెలిసింది. సొంతపార్టీ విషయమై ఆమెతమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో చర్చించిఆమె ఆశీస్సులు తీసుకున్నట్టు చెబుతున్నారు.

మరోవైపువిజయశాంతి ప్రత్యర్ధులు ఆమె చరిత్రనుతిరగదోడి ఆమె తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కాదనిప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు.విజయశాంతి తాత పశ్చిమగోదావరి జిల్లా నుంచి వరంగల్‌ జిల్లాఏటూరు నాగారం మండలం రామన్నగూడేనికికొన్ని దశాబ్దాల క్రితం వలస వచ్చారనివీరువివరాలు సేకరించారు. గోదావరి జిల్లాల యాసలోమాట్లాడే విజయశాంతిని తెలంగాణప్రజలు ఎలా ఆదరిస్తారని వీరు ప్రశ్నిస్తున్నారు.విజయశాంతిని రాములమ్మగా అభివర్ణించడం తగదని, ఆమెలోబడుగువర్గాల తరఫున పోరాడేతత్వం లేదని, ఆమె చెన్నైలో చేసిన చీకటి పనులచిట్టా తమ వద్ద ఉందనిటిఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X