బిజెపి ర్యాలీకి బాబుమొహం చాటు
సిబిఐ కొత్త డైరెక్టర్ పదవి దొరకు దక్కడం ఖాయమని గత కొద్ది నెలలుగా వినిపిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఏదో ఒక పరిణామం చోటుచేసుకుంటున్నది. తాజా కృషి బ్యాంకు వ్యవహారం కూడా దొరకు కంట్లో నలుసులా, కాలిలో ముళ్లులా మారింది. హైదరాబాద్‌లో కొన్ని వేల మంది డిపాజిటర్లకు కోట్లాది రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టి ఉడాయించిన కృషి బ్యాంకు చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు డిజిపి దొర కుమారుడు సత్యనారాయణకు సన్నిహితుడు అంటూ వెలువడుతున్న వార్తలు ఆయన ప్రతిష్టకు మచ్చగా మారాయి. ఈ మచ్చను చెరిపేసుకోవడానికి దొర శతప్రయత్నాలు చేస్తున్నా గత నెలరోజులపైగా జాడ లేకుండా పోయిన వెంకటేశ్వరరావు ఆచూకీ పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం ఆయన నెత్తికే చుట్టుకుంటున్నది.
వెంకటేశ్వరరావు బంధించడంలో పోలీసులే కావాలని అలసత్వం ప్రదర్శిస్తున్నారని డిజిపి కుటుంబానికి అతను సన్నిహితుడు కావడం వల్ల రక్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
అసలు గత ఏప్రిల్‌లో అప్పటి సిబిఐ డైరెక్టర్ రాఘవన్ పదవీ విరమణ చేసిన వెంటనే దొర కొత్త కుర్చీలో చేరిపోతారని అంతా భావించారు. చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎన్ విఠల్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ సూచించిన పానెల్‌లో దొర పేరే ప్రధానంగా వుంది. రాఘవన్ పదవీ విరమణకు సరిగ్గా కొద్దిరోజుల ముందు సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దొరను ఇరకాటంలో పెట్టాయి. ఈ వ్యాఖ్యలు సృష్టించిన వివాదం కారణంగా ఏప్రిల్ 30న రాఘవన్ పదవీవిరమణ చేసిన వెంటనే ప్రభుత్వం స్పెషల్ డైరెక్టర్‌గా వున్న పిసి శర్మను తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది.
1995-96లో దొర హైదరాబాద్ సిటీ కమిషనర్‌గా వున్న కాలంలో టాడా కింద అరెస్టయిన వ్యక్తుల ప్రాసిక్యూషన్‌కు యాంత్రికంగా ఉత్తర్వులు ఇచ్చారని కేసు పూర్వపరాలను పట్టించుకోలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన విషయం విదితమే. సిబిఐ పదవికి దొర పేరును పరిశీలించేప్పుడు ఈ వ్యాఖ్యలను
పరిగణలోకి తీసుకోక తప్పదని అటార్నీ జనరల్ సొలీ సోరబ్జి అంటుండగా, సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే మాత్రం కోర్టు వ్యాఖ్యాలు కమిషనర్‌గా దొర చేపట్టిన చర్యలను ఉద్దేశించి చేసినవి మాత్రమే తప్ప వ్యక్తిగతంగా ఆయనకు వ్యతిరేకంగా చేసినవి కావని వాదిస్తున్నారు.
ప్రధాని వాజ్‌పేయి సూచనల మేరకు కొత్త పానెల్‌ను తయారు చేసే సన్నాహాల్లో వున్న విఠల్ కమిటీ ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో వుంచుకోవల్సి వస్తుందని అంటున్నారు. పరిస్థితులను బట్టి చూస్తే సిబిఐ పదవి దొరకు అందని పండే అవుతుందేమోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. వ్యతిరేక పవనాలు ఎంత బలంగా వున్నా అనుకూల అంశాలు కూడా అంతే గట్టిగా వున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్సులు గట్టిగా వుండటం, మరో వైపు ప్రధాని వాజ్‌పేయి కూడా దొర విషయంలో ప్రసన్నంగా వుండటం ఆయన రేఖను ఆఖరు క్షణంలోనైనా తిప్పవచ్చని కూడా వారు చెబుతున్నారు. వీటన్నింటిని మంచి దొర పుట్టపర్తి సాయిబాబావారికి అనుంగుభక్తుడు, బాబావారి కరుణ ఆయనపై ఎలాగూ వుంటుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!