చిరంజీవీ భవ!brచిరంజీవి ప్రవర్తనలో పెను మార్పు... రాజకీయాల్లో పెద్ద మార్పు.....

పొలిటికల్ జర్నలిస్టులను తాను ఎదుర్కోవలసి వస్తుందన్న విషయం గ్రహించి చిరంజీవి వారు ఎటువంటి క్రిటికల్ ప్రశ్నలు అడిగినా అందుకు సంసిద్ధమైనట్టుగా, ఎంతో ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకున్నట్టుగా ప్రవరిస్తున్నారు. ప్రతిరోజూ ఆయన పొలిటికల్ విలేకరుల ఎదుట ఏదో ఒక విషయం చెప్పడం గొప్ప విషయమే. చిరంజీవి తనదైన సినిమా వలయం నుంచి బయట పడి సామాజిక, రాజకీయ చట్రంలోకి రావడం గొప్ప విషయం. రాజకీయాల ద్వారా సమాజిక సేవ చేయాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది.
ఆయన పార్టీని ఇతరులు దుర్వినియోగం చేయకపోతే చిరంజీవి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఎంతో కొంత బంగారంగా మారుస్తారనడంలో సందేహంలేదు. ఒక అభిప్రాయానికి రావడానికి ఒక వారం రోజులు ఆగుదాం. మెరుగైన సమాజంకోసం ఆశించే మనం మరికొన్ని రోజులు వేచి ఉందాం. కొత్తవారైనా తప్పులు చేస్తే చక్కగా విమర్శించడానికి వెనుకాడం మనం.












Click it and Unblock the Notifications
