చిరు-బాబు: కలిసేది లేదు

గతంలో విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ప్రయోగం విఫలం కావడమే టిడీపిపై చిరంజీవి విరక్తికి కారణమని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నిర్మాత, తన మిత్రుడు అశ్వనీదత్ కు తెలుగుదేశం టికెట్ ఇప్పించుకున్న చిరంజీవి తన అభిమానులకు పరోక్షంగా అశ్వనీదత్ కు ఓటు వేయవలసిందిగా సంకేతాలు పంపారు. ఆ ప్రయోగం దారుణంగా విఫలమైంది. చిరంజీవి మద్ద్దతు ఉన్నా అశ్వనీదత్ గెలవలేకపోయారు, కాంగ్రెస్ అభ్యర్ధి లగడపాటి రాజగోపాల్ విజయం సాధించారు.
చిరంజీవి మాటను అభిమానులు శిరసావహించలేదా? కేవలం అభిమానులు తమ ఓట్లను మాత్రమే వేసి ఊరుకున్నారా? కమ్మ, కాపు విభేదాలు తీవ్రంగా ఉండే కృష్ణా జిల్లాలో చిరంజీవి అభిమానులకు ఆనాటి చిరు సంకేతం వల్ల బాధ కలిగిందా? ఈ విషయాలపై సామాజిక విశ్లేషణ నిపుణులు ఆనేక విషయాలను తేల్చి చెప్పారు. రాష్టంలో అయితే రెడ్డీ, కాకపోతే కమ్మ ముఖ్యమంత్రులు వస్తున్నారు కానీ సంఖ్యాధిక్యత, ఇతర హంగులు ఉన్నా కాపు కులం నుంచి ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేకపోయారని, ఆ బాధ అధికంగా ఉన్న కాపు నాయకులు విజయవాడలో చిరంజీవి చారిత్రక తప్పిదం చేశారన్న విషయాన్ని ఆయనకు తెలియజెప్పేలా గత ఎన్నికల్లో వ్యవహరించారు.
ఇప్పుడు చిరంజీవి శిబిరంలో విజయవాడ ఎన్నిక ఒక స్టడీ మెటీరియల్ గా మారింది. బీసీలకు సముచితంగా, సంఖ్యాబలం బట్టి ప్రజారాజ్యం పార్టీ టికెట్లు లభిస్తాయని చిరు ఇప్పటికే ప్రకటించారు. కమ్మవారికి ఎన్ని టికెట్లు ఇవ్వాలన్న విషయం మీద చిరంజీవి శిబిరంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. చిరంజీవి అభిమానులు తమ ఓటు మాత్రమే వేసి మొక్కుబడి తీర్చుకోకుండా, ఒకొక్కరు కనీసం పది ఓట్లు పడేలా సగటు జనానికి తెలియజెప్పాలన్న వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆ వ్యూహాన్ని పటిష్టంగా అమలు చేస్తే చిరంజీవి ప్రజారాజ్యం సూపర్ హిట్ అయినట్టే.












Click it and Unblock the Notifications