• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సారి..పూరి

By Staff
|

Puri Jagannath
సినిమా వాళ్ళకు రివ్యూ రైటర్స్ పై ఉన్న కోపం ఫీల్డ్ పుట్టిన నాటి నుంచీ ఉన్నదే. అలాగే సమీక్షలు అనేవి కూడా సాహిత్యం పుట్టిన నాటి నుంచీ ఉన్నవే. అప్పట్లో నవలలు,నాటకాలు,కవితలు ఇలా ప్రతీ ప్రక్రియను విమర్శానాత్మక దృష్టితో పరిశీలించి తప్పు ఒప్పులు చెప్పుకుంటా..ముందుకెళుతూ ఆ సృజానాత్మక కళను ఎదగటానికి కృషి చేస్తూండేవారు. సినిమాల దగ్గరకొస్తే..పాత తరంలో కొంత మంది దర్శకులు,హీరోలు కూడా సమీక్షలను పాజిటివ్ గా తీసుకునేవారని ఆ తరం వారు చెప్తూంటారు.అవి తమ మీద కాదని..తమ సినిమా మీదని వారికి స్పష్టంగా అర్ధమై తగినట్లుగా ప్రతిస్పందించేవారు. అప్పట్లో చక్రపాణి గారు,ఎన్టీఆర్ వంటి వారు సమీక్షుకులను ప్రత్యేకంగా గౌరవించేవారని చరిత్ర చెబుతోంది.

అందుకే ఆ తరంలో నిష్పక్షిపాతంగా కొడవకంటి కుటుంబరావు,ముళ్ళపూడి వెంకట రమణ గారి వంటి మేధావుల రివ్యూలు వచ్చి సామాన్య జనాలను,సినిమా వారిని అలరించేవి. అప్పట్లో ఓ ప్రముఖ దర్శకుడు సైతం తన సినిమాను విమర్శిస్తూ వచ్చిన ఓ ఉత్తరం చూసి రాసిన వ్యక్తిని పిలిపించి గౌరవించాడని చెప్తారు. అలా సమీక్ష చేయటం అనేది ఓ చక్కని కళగా ప్రపంచ వ్యాప్తంగా డవలప్ అవుతూ వచ్చింది. మన స్వీయ ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయని సమీక్షలు రాస్తే ఎలాగ అని ప్రశ్నించటం ఇదే మొదటి సారి.

ఇక అందరికీ తెలిసున్న విషయమే...విదేశాల్లో సినిమా రిలీజుకు నాలుగైదు నెలల ముందే ప్రివ్యూలు,రివ్యూలు వస్తూంటాయి. తాజాగా స్లమ్ డాగ్ మిలియనీర్ అనే హాలీవుడ్ సినిమాకు అధ్బుతమైన రివ్యూలు(అఫ్ కోర్స్ వాటిని ప్రివ్యూలు అనవొచ్చు) రిలీజ్ కాకముందే వచ్చి ఆ సినిమా ఓపినింగ్స్ కి బాగా ఉపయోగపడ్డాయి. ఇలా ప్రపంచం గ్లోజులైజేషన్ అయిపోయిన స్ధితిలో సినిమా టాక్ బయిటకు రాకూడదు అంటే ఎలా కుదురుతుంది. అది వెబెసైట్ల ద్వారా కాకుండా ఎస్.ఎమ్.ఎస్ లద్వారా పాకచ్చు.ఫోన్ లద్వారా పరుగెట్టవచ్చు. మరి అంతదాకా ఎందుకు మార్నింగ్ షో కి పెద్ద జనం లేని వినాయకుడు వంటి కొన్ని సినిమాలకు సాయింత్రానికి జనం ఎలా పోగవుతున్నారు.

కమ్యూనికేషన్ వల్లే కదా. గతంలో పూరీ సినిమాలు హిట్టయినప్పుడు ఎవరూ ఇది ప్లాప్ అని అరిచి గీపెట్టి రాయలేదు కదా...ఉన్నదున్నట్లు చెబితే ఉలకు అయితే ఎలా...అయినా పూరీ జగన్నాధ్ తన సినిమాని ఎట్లా వ్యాపారం అనుకుంటున్నాడో అట్లానే వెబ్ మీడియా కూడా కొద్దో గొప్పో బ్రతుకు తెరవే కదా.వారికి రీడర్సే ప్రాణం కదా. తప్పుడు రివ్యూలతో ముందుకు వస్తే సైట్ క్రెడిబులటి ఎలా ఉంటుంది. రేపు ఎవరు నమ్మి చదువుతాడు.అలాగే సినిమా తీయటానికి ఏమిటి నీ అర్హత అని ప్రేక్షకుడెవరూ పూరీని ప్రశ్నించి ఉండరు. అట్లానే రివ్యూ రాయటానికి సమీక్షకుడిని ఏమిటి నీ అర్హత అని అడగటం ఎంత వరకూ సమంజసం.

ఎవరి ఆసక్తి,సృజనాత్మకత వారివే. అలాగే చెత్త సినిమా రివ్యూ చాలా బాగుంది అని వ్రాసినా...సినిమా హిట్టయిన సందర్భాలు లేవు..అంత తెలివి తక్కువుగా సమీక్షకుడి జడ్జిమెంట్ మీదే పూర్తిగా ఆధారపడే వాళ్ళూ ఉండరన్నది నిజం. ఇలాంటివన్నీ పూరీకి తెలియనివికాదా. ఇక ఈ సంగతలు ఎలా ఉన్నా ఆయనే సినిమాలో చివర చెప్పుకున్నట్లు ఆయన సినిమాలు తీయక మానరు...ప్రేక్షకులు చూడకా మానరు..రివ్యూలు రాయకా మానరు..హిట్టు అని రాసినప్పుడు ఆయన హ్యాపీ ఫీలవ్వకామానడు.ఫ్లాప్ అని రాసినప్పుడు...అదీ సంగతి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X