బాబుకు ఇదే అంతిమ పోరు!
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో తన భవిష్యత్తును తేల్చుకోనున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించకపోతే ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకమే. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెబుతున్న సంక్షేమ కార్యక్రమాల మీద జనం విశ్వసిస్తున్నట్టు కన్పించడం లేదు. సోషలిస్టు భావజాలంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్ధాపించారు. ఆయన అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపారు. టికెట్లు ఇచ్చే విషయంలో సామాజిక న్యాయాన్ని పాటించిన వ్యక్తి ఆయనే. అయితే చంద్రబాబు నాయుడి తొమ్మిదేళ్ళ పాలన కాలంలో సామాన్యులు బాగా ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ పార్టీని ్ధాపించిన సమయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన తన మిత్రుడైన వైఎస్ సలహా అడిగి మామగారి పార్టీ తెలుగుదేశంలో చేరారు.
తెలుగుదేశం పార్టీ ప్రధానాంశం బడుగు బలహీన వర్గాలు. చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ళ పరిపాలన కాలంలో ఆ విషయాలను విస్మరించి రాష్ట్రంలో "సంపద"ను సృష్టించడానికి ప్రయత్నించారు. ఆ సంపద ఎవరికి ఉపయోగపడిందో అందరికీ తెలుసు. బీసీలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి ఎన్టీఆర్ తన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చాక ఆ పార్టీలో ధన స్వామ్యం పెరిగింది. చంద్రబాబు నాయుడికి కులాభిమానం పెద్దగా లేదు కానీ ధనాభిమానం బాగా ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
ఈసారి తెలుగుదేశం నాయకత్వంలోని మహా కూటమి మహా ఓటమిని ఎదుర్కొంటే టిడిపికి కాలం చెల్లినట్టే. మరో ఐదేళ్ళ వరకు తెలుగుదేశం శ్రేణులు వేచి ఉండే పరిస్ధితులు కన్పించడం లేదు. చంద్రబాబు నాయుడి "మాంత్రిక" వ్యవహార శైలి ఈసారి పెద్దగా పనిచేయదని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications