చిరంజీవికి సిఎం పీఠం?

Chiranjeevi
హైదరాబాద్: కేంద్రంలో మాయావతి, రాష్ట్రంలో చిరంజీవి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసే అవకాశముందని కొందరు జ్యోతిష్యులు ఢంకా భజాయించి చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని స్ధానాలు బీఎస్పీకి రాకపోయినా రాజీ ఫార్ములా కింద మాయావతికి ప్రధాని పీఠం దక్కవచ్చని, ఆమె జాతకచక్రం అందుకు అనుకూలంగా ఉందని వీరు అంటున్నారు. అదే ఫార్ములా రాష్ట్రంలో చిరంజీవికి కూడా వర్తిస్తుందని చెబుతున్నారు. యాభై నుంచి వంద లోపు అసెంబ్లీ స్ధానాలు వచ్చినా చిరంజీవి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని ఒక అంచనా. కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని తెలుగుదేశం, చంద్రబాబు ముఖ్యమంత్రి కాకూడదని కాంగ్రెస్ పట్టుదలగా ఉండడం చిరంజీవికి లాభించే అంశమని చెబుతున్నారు. అమెరికాలో ఒబామా అధికారంలోకి రావడం ప్రపంచవ్యాప్తంగా దిగువ జాతుల వారికి అధికారం వచ్చే అవశాలకు సంకేతమని జ్యోతిష పండితులు లెక్కలుగట్టి చెబుతున్నారు. కేంద్రంలో మాయావతి, రాష్ట్రంలో చిరంజీవి అధికారంలోకి వస్తారని చెప్పడానికి ఈ లాజిక్ నే వారు ఉదహరిస్తున్నారు. ముప్పై మంది ఎంపీలతో గతంలో చంద్రశేఖర్ ప్రధాని అయిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఇంకా పునాదులే సరిగ్గా పడని ప్రజారాజ్యం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యి, విజయవంతంగా ప్రభుత్వాన్ని నడపడం చిరంజీవికి అంత తేలికైన విషయం కాదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అఖండమైన మెజారిటీతో గెలిచినా ఎన్టీఆర్ మొదట్లో ప్రభుత్వాన్ని సరిగా నడపలేకపోయారు. నాదెండ్ల భాస్కరరావు పొడిచిన వెన్నుపోటుకు బలయ్యారు. ఆ తర్వాత రాష్ట్రమంతటా తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. చిరంజీవి కూడా ఒక కోటరీలో బందీ అయిపోయారు. ఆయన కొందరు చెప్పినట్టు నడుచుకోక తప్పని పరిస్ధితులు ఉన్నాయి. ఆ విషయం టికెట్ల కేటాయింపు ప్రక్రియలోనే తేటతెల్లమైంది.

ప్రజారాజ్యం సంస్ధాగత నిర్మాణంపై చాలా విమర్శలు ఉన్నాయి. అది నిజమైన బిల్డింగ్ లా కాకుండా సినిమా సెట్టింగా ఉందని నిపుణుల వ్యాఖ్య. అల్లు అరవింద్ ప్రజాప్రనిధిలాగా కాకుండా ప్రజారాజ్యం "నిర్మాత"లా వ్యవహరించే ప్రమాదముంది. పటిష్టమైన పునాదులు గల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను తట్టుకుని చిరు పార్టీ నిలబడాలంటే మరి కొన్ని దశాబ్దాలు పడుతుందని అంటున్నారు. అయినా జాతకం తోసుకుని వస్తే చిరంజీవి ముఖ్యమంత్రి కావడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. చిరంజీవికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తున్నా, శని ఆయనకు యోగకారకుడు కాబట్టి అధికారం కట్టబెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+