హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఇంకా మారాలి!

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వందకు పైగా అసెంబ్లీ టికెట్లను బీసీలకు ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. ఆ విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు గంగవెర్రులెత్తుతున్నారు. గెలిచే అభ్యర్ధులకే టికెట్లు ఇవ్వాలనుకుంటున్న ఆయనకు కమ్మ, రెడ్డి తదితర అగ్ర వర్ణాల అభ్యర్ధులే కంటికి ఆనుతున్నారు. ఎన్టీఆర్ లాగా లారీ డ్రైవర్లకు టికెట్లు ఇచ్చి గెలిపించగల ఆకర్షణ శక్తి చంద్రబాబు నాయుడికి లేదన్నది వాస్తవం.

చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని మహా కూటమి పైకి బాగా కనిపిస్తున్నా దాని లొసుగులు దానికున్నాయి. అనేక స్ధానాల్లో మిత్రుల మధ్య కోల్డ్ వార్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం మేనిఫెస్టోలో పేదలకు, మధ్యతరగతి వారికి అనేక వరాలు కురిపించినా చంద్రబాబు నమ్మే స్ధితిలో ప్రజలున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు సబ్సీడీలను, సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేసి ఆకాశ మార్గంలో విహరించిన ఆయన మీద కోపాన్ని గ్రామీణ పేదలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు.

అయితే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసి ఆయనలో కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ కు ధన బలం సహజంగా అధికంగా ఉంటుంది. కాంగ్రెస్ ఖర్చు చేసే దానిలో సగమైనా ఖర్చు చేయడానికి ధన సమీకరణ చేయాలన్న కృత నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ ఉంది. టీఅర్ ఎస్ అభ్యర్ధులపై పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేకపోయినా ఉభయ కమ్యూనిష్టు అభ్యర్ధుల ఖర్చును తెలుగుదేశమే భరించవలసి ఉంటుంది.

తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రధాన వెబ్ సైట్లలో పార్టీ ప్రకటనలు ప్రారంభించింది. ఎస్ ఎం ఎస్ ల ద్వారా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలైంది. బిజెపి కూడా వెబ్ సైట్ల ద్వారా ప్రచారం మొదలు పెట్టింది. బిజెపి-ప్రజారాజ్యం దగ్గరవుతున్న సూచనలు చంద్రబాబును కలవరపెట్టినా, బిజెపితో కలిసేది లేదని చిరంజీవి స్పష్టం చేయడంతో బాబు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తన విశ్వసనీయత పెంచుకోవాలంటే ఇంకా ఎన్నో మెట్లు కిందికి దిగిరావలసి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X