చిరు పార్టీ ఇంకా చిన్నదవుతుందా?

ప్రస్తుతం ప్రతిపక్ష నేతల చూపు కాంగ్రెస్ పార్టీపై ఉందని, అందునా పీఆర్పీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కృష్ణా జిల్లా నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ చెప్పినట్లు సమాచారం. సీఎం క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సమక్షంలో, ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా మంత్రి పార్థసారధి, పీసీసీ జిల్లా సమన్వయకర్త సంభాని చంద్రశేఖర్, కృష్ణా జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులతో వైఎస్ సమీక్ష జరిపారు.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం..ఎన్నికల్లో జిల్లాలోని 16 నియోజక వర్గాల్లో కేవలం ఆరింటే విజయం సాధించడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో పీఆర్పీ అభ్యర్థులు బాగా డబ్బులు ఖర్చుపెట్టినట్లు నేతలు చెప్పారు. వారిలో చాలామంది కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని వారు చెప్పగా..తనకు కూడా సమాచారం అందుతోందని, పార్టీకి ఉపయోగపడేవారు వస్తానంటే చేర్చుకోవాలని సీఎం సూచించారు.












Click it and Unblock the Notifications