చిరంజీవీ, 'మార్పు' ఇలా....

చిరంజీవి పార్టీకి జూబిలీహిల్స్ రోడ్ నెంబర్ 46 లో ఒక ఆఫీసు ఉంది. కృష్ణానగర్-జూబిలీహిల్స్ హద్దులో మరో కార్యాలయం ఉంది. నిత్యం వందలాది అభిమానులతో, టికెట్లు ఆశించేవారు వేసుకువచ్చే భారీ వాహనాలతో, బాణాసంచా పేలుళ్ళతో జూబిలీహిల్స్ లో ప్రశాంతంగా జీవిస్తున్న విఐపిలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. "మా ప్రశాంతతకు భంగం కలుగుతోంది" అని ప్రజారాజ్యం పార్టీ ఉంటున్న డివి శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రజారాజ్యం ఆఫీసు వద్ద ఉంటున్న మాజీ ఎంపీ ఆర్ సురేందర్ రెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరంజీవిని కలిసి ఇబ్బందులను వివరించామని ఆయన చెప్పారు.
ఎన్నికల సమయం కావడంతో ప్రజారాజ్యం ఆఫీసుల వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. కార్యకర్తల నినాదాలు, కార్లలో నుంచి పార్టీ పాటలు, టపాసుల శబ్దాలు న్యూసెన్స్ లా తయారయ్యాయి. కానీ కార్యకర్తలు తమ మాట వినడం లేదని, ఏమీ చేయలేమని ప్రజారాజ్యం పార్టీ నాయకులు చేతులెత్తేస్తున్నారు.












Click it and Unblock the Notifications