హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాడుకుని వదిలేస్తారా?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ కూరలో కరివేపాకేనా? చంద్రబాబు నాయుడు ఆయనను తురుఫు ముక్కగా ఉపయోగించుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. జూనియర్ ను మీ ఇంటి చాయలకు రానివ్వొద్దని చంద్రబాబు నాయుడు పురంధ్రీశ్వరికి చెప్పిన విషయాన్ని, ఆ ఇంటి గుట్టును దగ్గుబాటి బయట పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లి ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారంలో జూనియరే మహా సీనియర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు బాగా మురిసిపోతున్నారు. ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎంత కపట నాటక సూత్రధారో జూనియర్ కి తెలియక కాదు. తనకు, తన తల్లికి ఆ కుటుంబంలో గౌరవనీయమైన పాత్ర కోసం ఆయన రోడ్ షోలలో రెచ్చి పోయి నటిస్తున్నాడు.

చంద్రబాబు నాయుడిని ఇంకా జనం నమ్మే పరిస్ధితి లేదని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీలకు, సంక్షేమానికి వ్యతిరేకంగా వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ కంటే జూనియర్ ఎన్టీఆర్ కే ఎక్కువగా జనం వస్తున్నారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు అంగీకరించారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా "ఈ నలభై రోజులే రాజకీయ ప్రచారం, ఆ తర్వాత నా కెరియర్ నేను చూసుకోవాలి. నా సినిమాల్లో నేను నటించాలి" అంటున్నాడు. కాంగ్రెస్ నాయకులు మాత్రం పాతికేళ్ల వయసున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రచారానికి వచ్చి తన కెరియర్ ను పాడు చేసుకుంటున్నాడని మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు వెండితెరపై పెద్ద హీరో. అతనికి ఉన్నంత ఈజ్ కొత్తతరం హీరోలలో ఎవరికీ లేదు. సినిమా రంగంలో ఏటా కోట్లాది రూపాయలు సంపాదించుకునే వీలున్నా జూనియర్ చంద్రబాబు నాయుడు మాట మీద ఎందుకు రాజకీయ రంగంలోకి వచ్చినట్టు? వైస్రాయ్ డ్రామా జరిగినప్పుడు దగ్గుబాటి చంద్రబాబు నాయుడిని ఇలా ప్రశ్నించారట "హరికృష్ణను, బాలకృష్ణను ఎలా ఒప్పించావు, ఎలా తెప్పించావు" అని. అందుకు బాబు చెప్పిన సమాధానం వాళ్ళకి ఏదో చెప్పానులే" అని. దానిని దగ్గుబాటి ఇప్పుడు ఎలా విశ్లేషిస్తున్నారంటే నందమూరి వారసులని తేలిగ్గా బోల్తా కొట్టించగలనన్న నమ్మకం బాబుకు ఉందని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరగబోతోందని దగ్గుబాటి ఉవాచ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X