హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసినేనిపై చర్య: చిరు భయం

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం నాయకుడు కేసినేని నాని విషయంలో ఆ పార్టీ అధినాయకత్వం ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రజారాజ్యంలో కమ్మవారికి ప్రాధాన్యం లేదని, అది కాపుల ఇష్టారాజ్యమని నాని విమర్శించిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం విజయవాడ కన్వీనర్ గా ఉన్న నాని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఒక కులం, ఆ కులానికి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఓట్లు కోల్పోతామన్న భయం ప్రజారాజ్యం పార్టీకి పట్టుకున్నట్టుంది. ఇప్పటికే పార్టీ కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టుకున్న నాని పార్టీకి రాజీనామా చేయకుండా చూరు పట్టుకుని వేళ్ళాడుతున్నారు. పార్టీ తన మీద వేటు వేస్తే తెలుగుదేశంలో చేరడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు.

కృష్ణాజిల్లా ప్రజారాజ్యం చిన్నా చితకా నాయకులకు కేసినేని నాని మీద అభిమానం ఉంది. జిల్లాలో పార్టీ సంస్ధాగత నిర్మాణంలో ఆర్ధిక సహాయం చేయడంలో ఆయన చొరవ తీసుకోవడమే దానికి కారణం. ఆర్ధిక బలం, పలుకుబడి అంతగా లేని విజయనిర్మలను కృష్ణాజిల్లా కన్వీనర్ ను చేయడం వల్లనే సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఆ విషయాన్ని ప్రజారాజ్యం అధిష్టానవర్గం గుర్తించినా దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు.

చాలాకాలం పాటు తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుగా ఉన్న కేసినేని నాని ప్రజారాజ్యం పార్టీలో ఎందుకు చేరారని కొందరు నోటి మీద వేలేసుకుంటున్నారు. ఆయన తెలుగుదేశం ఏజెంట్ గా ప్రజారాజ్యంలోకి ప్రవేసించి ఉంటే అంత డబ్బు ఖర్చు చేసుకోవలసిన అవసరం ఏముంటుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X