వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజారాజ్యానికి పవనే ప్రాణమా?

By Staff
|
Google Oneindia TeluguNews

Pavan
హైదరాబాద్: వామపక్షాల మీద యువరాజ్యం అధినేత పవన్ కల్యాణ్ నిన్న ఖమ్మంలో చేసిన విమర్శలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ విమర్శల మీద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు స్పందించవలసి వచ్చింది. పవన్ కల్యాణ్ కు వామపక్షాల సామాజిక న్యాయం గురించి తెలియదని, ఆయన ఆ సమయంలో మందు తాగో, కల్లు తాగో నిద్రపోయి ఉంటాడని రాఘవులు వ్యాఖ్యానించారు.

నిజానికి కొంత మంది వామపక్ష నాయకులకు మందు తాగే అలవాటు ఉందేమో కానీ పవన్ కల్యాణ్ కు ఆ అలవాటు లేదని అన్ని రకాల వర్గాల కథనం. తమకు బలం ఉన్న ఖమ్మం జిల్లాలో పవన్ తమ పరువు తీశాడన్న అక్కసుతో బివి రాఘవులు అతడిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం మరిన్ని విమర్శలకు దారి తీస్తోంది. దీనితో అర్ధమయ్యేదేమిటయ్యా అంటే పవన్ తెలంగాణ జిల్లాల్లో కమ్యూనిస్టుల కోటలకు గండి కొడుతున్నాడని. ఆ సమాచారం రాకపోతే రాఘవులు అలా ప్రతిస్పందించే వారు కాదేమో.

పవన్ కల్యాణ్ ప్రచారం చిరంజీవి కంటే బాగా ఉందన్న అభిప్రాయం ఉంది. తనకున్న నాలెడ్జితో, ఎనర్జీతో పవన్ తెలంగాణ జిల్లాల్లో బ్రహ్మాండంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి, మహా కూటమి దృష్టి పవన్ కల్యాణ్ మీద పడింది. వివిధ వృత్తుల వారు తనకు కలిసినప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడుతూ, రకరకాలుగా వాళ్ళతో కలిసిపోతూ పవన్ చేస్తున్న విన్యాసాలు ఈ ఎన్నికల సమయంలో యువతీ యువకులను ఆకర్షిస్తున్నాయి.

నిజానికి చిరంజీవి పవన్ కల్యాణ్ నుంచి రాజకీయ ఉపన్యాస పాఠాలు నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో సౌమ్యంగా ప్రసంగాలు చేయడంతో చిరంజీవి సభల్లో పెద్దగా ప్రతిస్పందన కన్పించేది కాదు. ఎప్పుడైతే చిరంజీవి ఆ సత్యాన్ని గ్రహించారో ఆయన పవన్ కల్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని ఆయనలా ఆవేశంగా ప్రసంగించడానికి ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X