'శివ'కు 20 ఏళ్ళు!

"బ్రూస్ లీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్" ఈ చిత్రానికి ప్రధాన ప్రేరణ. అలాగే ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలను అనేక చిత్రాల ప్రేరణతోనే నేను రూపొందించాను. 'అర్జున్, అర్ధసత్య, కాలచక్ర" వంటి చిత్రాల స్ఫూర్తి 'శివ"పై చాలా ఉంది. అయితే, ఆయా చిత్రాలనుంచి నేను ప్రేరణ పొందానే తప్ప ఎక్కడా అనుకరణకు చోటివ్వలేదు. అలాగే ఈ చిత్రం విజయంలో సౌండ్ ఎఫెక్ట్ లు కీలకపాత్ర పోషించాయి. సౌండ్ ఎఫెక్ట్ లు జోడించడానికి ముందు ఈ చిత్రాన్ని చూసినవాళ్లంతా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందనుకున్నారు. నిర్మాతలు సురేంద్ర, వెంకట్‌లు సైతం మహా అయితే ఈ చిత్రం యావరేజ్‌గా ఆడుతుందనుకున్నారు. నేను కాకుండా, ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మిన ఏకైక వ్యక్తి నాగార్జున. అయితే 20 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంచుకునేంత సంచలనం సృష్టిస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. బహుశా నాగార్జున కూడా అనుకుని ఉండరు!"
ఈ సినిమాకు సంబంధించిన వివరాలు:
విడుదల తేది: అక్టోబర్5, 1989
నిర్మాణం: యస్.యస్.క్రియేషన్స్-అన్నపూర్ణ స్టూడియోస్
తారాగణం: అక్కినేని నాగార్జున, అమల, రఘువరన్, సాయిచంద్, చక్రవర్తి(జెడి) శుభలేఖ సుధాకర్, తనికెళ్ల భరణి, ఉత్తేజ్, మురళీమోహన్, జితేంద్ర(చిన్నా) నరేష్(జగన్) కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు
సాంకేతికవర్గం: మాటలు: తనికెళ్ల భరణి, పాటలు: వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్ర్తి, నేపధ్యగానం: బాలు, మనో, యస్.జానకి, చిత్ర, నృత్యాలు: సుందరం, కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: యస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఇళయరాజా, నిర్మాతలు: యార్గగడ్డ సురేంద్ర-వెంకట్ అక్కినేని, కథ, చిత్రానువాదం, దర్శకత్వం: రాంగోపాల్‌వర్మ.
రాంగోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రం నాగార్జునకు 17వది. 55 రోజుల్లో పాటలు సహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికయిన ఖర్చు 85 లక్షలు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు పారితోషికంగా 50,000 రూ.లతోపాటు లాభాల్లో 5 శాతం అందుకున్న రాంగోపాల్ వర్మ 'బెస్ట్ డెబ్యూ డైరక్టర్"గానే కాకుండా 'బెస్ట్ డైరక్టర్"గానూ ఆ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డులు పొందారు. మూసకు విరుద్ధంగా రూపొందిన ఈ చిత్రం సరిగ్గా అడదేమోనన్న భయం నిర్మాతల్లో ఉండేది. అయినా ఈ చిత్రం అనూహ్యంగా ప్రేక్షకుల ఆదరణ పొంది అప్పట్లోనే ఒక్క నైజాంలోనే కోటి రూపాయలకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. అలాగే విడుదలకు ముందు ఈ చిత్రం తమిళ డబ్బింగ్ రైట్స్ అమ్మాలని చూస్తే లక్ష రూపాయలకంటె ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. విడుదలయ్యాక ఈ చిత్రం తమిళ డబ్బింగ్ రైట్స్‌కు 85 క్షలు పలకడం విశేషం. 'ఇదయం" పేరుతో తమిళంలో అనువాదమైన ఈ చిత్రం అక్కడ 2 కోట్లకు పైగా వసూలు చేసింది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications