ప్రజారాజ్యం పైనే గురి!

కాంగ్రెస్ అగ్ర నాయకులు ఇప్పటికే ప్రజారాజ్యం "నిర్మాత"ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి నలభై నుంచి యాభై వరకు అసెంబ్లీ స్ధానాలు వచ్చే అవకాశముంది. కరెక్టుగా అన్నే స్ధానాలు కాంగ్రెస్ కు తక్కువ పడే అవకాశముంది. అయితే సామాజిక న్యాయం అనే నినాదంతో రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రజారాజ్యం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి అనేక షరతులను ఫ్రేం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని ఆ "నిర్మాత" కాంగ్రెస్ కు ఫీలర్ పంపినట్టు సమాచారం. అయితే వైఎస్ అందుకు అంగీకరిచరన్న విషయం అందరికీ తెలిసిందే.
ఈసారి ఎన్నికల్లో చిరంజీవి చాలా కీలక పాత్ర వహించారు. ఆయనది అధికారంలోకి వచ్చేటంటి విప్లవం కాకపోయినా నిశ్శబ్ద యుద్ధమే. కాపుల ఓట్లను గరిష్ట స్ధాయిలో ప్రజారాజ్యం ఆకర్షించగలిగినట్టు తెలుస్తోంది. కులంతో సంబంధం లేకుండా యువకులు, మహిళల ఓట్లను కూడా చిరంజీవి ఆకర్షించగలిగారు. అయితే ఎన్నికల మేనేజ్ మెంట్ లో లోపాల వల్ల పూర్తి స్ధాయిలో లాభపడలేకపోయారు. పార్టీ సంస్ధాగత నిర్మాణం పటిష్టంగా లేకపోవడం వల్ల ఈ పరిస్ధతి ఏర్పడింది. సంప్రదాయికంగా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న కాపు ఓట్లు ఈసారి ప్రజారాజ్యానికి పడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అపార నష్టం వాటిల్లినట్టు కన్పిస్తోంది. లేకపోతే రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఒంటి చేత్తో మెజారిటీ స్ధానాలను కైవసం చేసుకునేది.
ప్రజారాజ్యం వల్ల వల్ల జరిగిన నష్టాన్ని ప్రజారాజ్యం మద్దతుతోనే పూడ్చుకోవాలన్నది వైఎస్ అభిమతంగా కన్పిస్తోంది. సోమవారం ఢిల్లీ వెళ్తున్న ఆయన హైకమాండ్ కు యధార్ధ పరిస్ధితిని వివరించే అవకాశముంది. అయితే వైఎస్ దృష్టి ప్రజారాజ్యం సీట్లపైనే ఉందనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications
