చివరి ఆశ చిరు!

అయితే చిరంజీవి పార్టీకి యాభైకి పైగా అసెంబ్లీ స్ధానాలు వచ్చే పక్షంలో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ప్రజారాజ్యం మేధావుల అంచనా. కాంగ్రెస్, మహాకూటమి ఒకరికి ఒకరు సహకరించికునే అవకాశం లేనందున వారు చిరంజీవికి మద్దతు ఇవ్వక తప్పదు. ఎవరు మంచి బేరంలో ముందుకు వస్తే వారి మద్దతు తీసుకుని ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్నది చిరంజీవి వ్యూహంలా కన్పిస్తోంది. చిరంజీవిని సిఎంను చేయడమే తమ లక్ష్యమని, అందుకోసం వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నామని ప్రజారాజ్యం సీనియర్ నాయకుడు ఉపేంద్ర అన్నారు.
అయితే చిరంజీవి పార్టీకి 30 స్ధానాలు, ఆ లోపు వస్తే, కాంగ్రెస్ కు 120-130 మధ్య సీట్లు వస్తే కాంగ్రెస్ కే ప్రజారాజ్యం మద్దతు ఇచ్చేలా చర్చలు సాగుతున్నాయి. మహాకూటమికి మాత్రం ప్రజారాజ్యం మద్దతు ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదు. దీనిని ఆసరాగా తీసుకుని వైఎస్ మనుషులు అల్లు అరవింద్ తో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. అల్లు అరవింద్, చిరంజీవి రాజకీయాలకు కొత్త అయినా ఉపేంద్ర వంటి వారి సలహాలతో రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు.
చిరంజీవి పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీకి, వామపక్షాలకు ఎక్కువ నష్టం జరిగిందని వైఎస్ వందిమాగధులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ వందిమాగధులే జాతీయ మీడియాను కూడా తప్పు పట్టించారు. కానీ చిరంజీవి వల్ల కాంగ్రెస్ కే ఎక్కువ నష్టం జరిగిందని ఆలస్యంగా గ్రహించిన వైఎస్ ఇప్పుడు చిరు మద్దతు కోసం అర్రులు చాస్తున్నారు.












Click it and Unblock the Notifications