జగన్ పై చర్యలు తప్పవా?

YS Jagan
ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెసు అధిష్టానం పూర్తిగా సమాయత్తమైనట్లు కనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించడం వైయస్ జగన్ వర్గీయులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే మరో వైపు జగన్ పై చర్యలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మాటలను ఆ విషయం స్పష్టమవుతోంది. సాధారణంగా జైపాల్ రెడ్డి ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడరు. కానీ శనివారం ఆయన పని కట్టుకుని వైయస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, మరో కేంద్ర మంత్రి పల్లంరాజు వైయస్ జగన్ కు సలహాలు ఇచ్చారు. వైయస్ జగన్ పార్టీ అధిష్టానంతో విధేయంగా మెలిగితే మంచిదని ఆయన ఓ ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.

సాక్షి దినపత్రికలో, చానెల్లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన వార్తాకథనంతో వైయస్ జగన్ కు వ్యతిరేకంగా అధిష్టానం చురుగ్గా పావులు కదుపుతోంది. ఆ వార్తాకథనంతో పెల్లుబుకిన విమర్శలను వైయస్ సాక్షి మీడియా కొట్టిపారేస్తూ ఎదురుదాడికి దిగింది. దీంతో సోనియా వైయస్ జగన్ పై మరింత సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా, సాక్షి మీడియా యువ నేత రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేసుకుంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమిని ఆసరాగా తీసుకుని రాహుల్ పై సాక్షి మీడియా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాహుల్ మంత్రం పని చేయలేదని వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో పెద్ద యెత్తున వార్తలు వచ్చాయి.

సాక్షి వార్తాకథనాలతో వైయస్ జగన్ కు సంబంధం లేదని, వైయస్ జగన్ కూ అధిష్టానానికీ మధ్య ఆగాధం పెంచడానికి జగన్ వ్యతిరేకులు పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారని వైయస్ జగన్ వర్గీయులు అంటున్నారు. అయితే జగన్ వర్గీయుల వాదనలు సోనియా తీవ్రత ముందు పని చేయడం లేదు. వైయస్ జగన్ పై తీసుకునే చర్యలపై చర్చించడానికి శనివారం ఎఐసిసి క్రమశిక్షణా సంఘం కూడా సమావేశమైందని అంటున్నారు. మొత్తం మీద, వైయస్ జగన్ పై చర్యలు తప్పవనే మాట గట్టిగా వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+