అల్లు అరవింద్ తో చిరంజీవికి మరో డేంజర్

అల్లు అరవింద్ యాభై లక్షలు తీసుకుని టికెట్ ఇవ్వలేకపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్ధి హైదరాబాద్ లో చాలా కాలం ఉండి ప్రతి రోజూ ప్రజారాజ్యం పార్టీ ఆఫీసుకు వెళ్ళేవాడు. నమ్మకంతో అంత డబ్బులు ఇచ్చిన ఆ వ్యక్తి అల్లు అరవింద్ మేనేజ్ మెంట్ స్కిల్స్ కు బలి కావలసి వచ్చింది. "నేనెందుకు నీకు డబ్బు ఇవ్వాలి. నాకు డబ్బు ఇచ్చినట్టు నీ వద్ద రిసీట్ ఉందా" అని అరవింద్ అడిగేసరికి అతని ప్రాణంలో సగం పోయింది. ఆ తర్వాత అతను హైదరాబాద్ లోనే ఉండి అరవింద్ కారును ఆపి ఆత్మ హత్య చేసుకుంటానని బెదిరించేసరికి మొదట పది లక్షలు ఇచ్చారట. ఆ తర్వాతి సంగతుల మీద స్పష్టమైన సమాచారం లేదు.
ఇప్పుడు అల్లు అరవింద్ మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాల్లో కీలకమైన పాత్ర వహిస్తున్నారు. ఆయన ఈ విషయాన్ని ఇటీవల మీడియాకు వెల్లడించారు. ఒక పెద్ద నిర్మాతగా, చిరంజీవి బావమరిదిగా ఆయన పాత్ర పెద్దదే. సినిమా రంగంలో సంపదను సృష్టించి చాలా మందికి రోజు కూడు పెట్టిన పెద్దవాళ్ళలో ఆయన ఒకరు. అయితే స్వార్ధానికి కొన్ని హద్దులు ఉండాలి. చిరంజీవిని సోనియా గాంధీ స్వయంగా పిలిచి కొన్ని హామీలు ఇచ్చిన తర్వాతే అరవింద్ ఇప్పుడు మళ్ళీ ప్రజారాజ్యంలో యాక్టివ్ కావడమేమిటి? చిరంజీవి తన వ్యవహారాలను స్వయంగా మేనేజ్ చేసుకోలేరా? అల్లు అరవింద్ వల్ల చిరంజీవి మరోసారి అప్రదిష్ట పాలు కానున్నారా? త్వరలో అనేక విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.












Click it and Unblock the Notifications