కమ్మ కులస్థులు బిసిలా?

Katta Subramanya Naidu
కమ్మ కులానికి చెందిన ప్రజలు వెనకబడిన తరగతుల జాబితాలో వస్తారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటారు. ఈ విచిత్రమేమిటని ఆశ్చర్యపోతారు. అయితే, కమ్మ కులానికి చెందినవారు బిసీలనే విషయాన్ని కర్ణాటక ఐటి మంత్రి కట్టా సుబ్రమణ్య నాయుడు తేల్చేశారు. ఆయన ఆ కులం పేరుతో ప్రకటనలు ఇస్తున్నారు. ఆయన కమ్మ కులానికి చెందిన చెందినవారు. కట్టా సుబ్రమణ్య నాయుడుకు ఓ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు గత రెండు రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు (కెఐఎడిబి) భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. భూసేకరణ నష్టపరిహారం చెల్లింపు సమయంలో సుబ్రమణ్య నాయుడు పరిశ్రమల మంత్రిగా ఉన్నారు.

తనపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు ఆయన బిసి కార్డును వాడుతున్నారు. తాను బిసి కావడం వల్లనే తనపై విమర్శలు వస్తున్నాయని కట్టా సుబ్రమణ్య నాయుడు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్లు, కమ్మలు శూద్రకులాలే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో అగ్రకులాలకు చెందుతారు. కర్ణాటక, దక్షిణ తమిళనాడుల్లో కమ్మలు, రెడ్లు బిసి జాబితాలోకి వస్తారు. సాధారణ జనాభాలో చాలా తక్కువ సంఖ్యలో ఉండడంతో వారిని బిసి జాబితాలో చేర్చారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలో కమ్మలు, రెడ్లు పెరిగారు. రాజకీయంగా, పారిశ్రామికంగా కూడా కర్ణాటక రాష్ట్రంలో ప్రాబల్యాన్ని కనబరుస్తున్నారు.

కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి సోదరులు శాసిస్తున్నారని చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. రెడ్లు, కమ్మలు కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్, వొక్కలిగల స్థాయికి పెరిగారు. కమ్మలు కర్ణాటక రాష్ట్రంలో బిసిలు కావడంతో కట్టా సుబ్రమణ్య నాయుడు తనపై వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడానికి బిసి కార్డు వాడుతున్నారని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+