చంద్రబాబు అన్నమే తినరు

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తొలిసారి తీవ్ర పోరాటానికి శ్రీకారం చుట్టారు. రైతు సమస్యలపై ఆయన నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆమరణ నిరాహార దీక్షకు, నిరవధిక నిరాహార దీక్షకు తేడా ఉన్న మాట వాస్తవమే. కానీ, చంద్రబాబు పచ్చి మంచినీళ్లు ముట్టవచ్చు గానీ దీక్షలో ఉండగా ఆహారం తీసుకోకపోవచ్చు. అయితే, నిజానికి చంద్రబాబు రోజువారీ ఆహార పద్ధతులే గమ్మత్తైనవి. ఆయన బిపి, షుగర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అన్నానికి అంటే రైస్ కు చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. మొదట్లో కేవలం ఆకు కూరలు మాత్రమే తినేవారు. కానీ, ఓసారి ఆయన పార్టీ సమీక్షా సమావేశంలో కళ్లు తిరిగి పడిపోయారట. దాంతో తాను తీసుకునే ఆహారంలో కాస్తా మార్పులు చేసుకున్నారు.

ఆరోగ్యానికి చంద్రబాబు చాలా ప్రాధాన్యత ఇస్తారనే విషయం అందరికీ తెలిసిందే. చాలా సమావేశాల్లో ఆయన ఆరోగ్య పాఠాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తారు. రెండు గంటలపాటు యోగా, ఎక్సర్ సైజు చేస్తారు. పచ్చ సొన తీసేసిన చేసిన గుడ్డు ఆమ్లెట్ తింటారు. ఓట్స్, రాగి జావా తీసుకుంటారు. మధ్యాహ్నం రెండు, మూడు పుల్కలు మాత్రమే తింటారు. అందులో నూనె ఆనవాళ్లు లేకుండా చూసుకుంటారు. మూడు రకాల కూరగాయలు అందులో తీసుకుంటారు. అప్పుడప్పుడు ఓ కప్పు పెరుగు తింటారు.

సాయంత్రం పూట మిక్శ్చర్ తీసుకుంటారు. ఇది తప్పనిసరి. ఆ తర్వాత గ్రీన్ టీ తాగుతారు. తాను తినే ఆహారంలో ఉప్పు, కారం చాలా తక్కువగా ఉండేలా చూసుకుంటారు. రాత్రి పూట తులసి ఆకులు వేసిన వేడినీళ్లు తాగుతారు. రోజులో మంచినీళ్లు తాగాల్సి వస్తే వేడి నీళ్లు మాత్రమే తాగుతారు. ఇలా, చంద్రబాబు తన తిండిలో అన్నం లేకుండా చేసుకున్నారు. ఇంత తక్కువ ఆహారం తీసుకునే చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి పూనుకోవడంతో పార్టీవర్గాల్లో, కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+