జగన్ కు బాబాయ్ షాక్

ఇప్పటికే వైఎస్ వివేకానంద సాక్షిలో వచ్చిన కథనాలు తప్పు బట్టాడు. జగన్ సైతం వాటికి ఆవేదన చెంది ఉంటాడన్నాడు. దీంతో పరోక్షంగా జగన్ తప్పు చేశారని ఒప్పుకున్నట్టయింది. అందుకే ఆయన జగన్ తో సోనియాకు క్షమాపణ చెప్పిస్తానని ప్రకటించాడు. అయితే దానిని అంబటి రాంబాబు ఖండించాడు. జగన్ ఏ తప్పు చేయలేదని, వివేకా కుట్రదారుల పావులా మారారని దుయ్యబట్టారు. జగన్ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. పదవి కోసమో డబ్బు కోసమో వివేకా జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
అంతేకాకుండా డిఎల్ రవీంద్రారెడ్డికి కూడా మంత్రి పదవి ఇచ్చి జగన్ కు మరింత దూరం చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే డిఎల్ రవీంద్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్పై రాజశేఖరరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన్ను మరింత దరి చేర్చుకొని రాష్ట్రంలోనే కాకుండా సొంత జిల్లాలో సైతం జగన్ ను ఏకాకిని చెయ్యడానికి ఎత్తులు వేస్తోంది.












Click it and Unblock the Notifications