అధిష్టానం ముందు 3 డిమాండ్లు పెట్టిన జగన్?

రోశయ్య ఉన్నప్పుడు కూడా ఆయన ఓదార్పులో తప్పితే విలేకరుల ముందేమీ మాట్లాడలేదు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటించినప్పుడు ఆయన స్పందన ఎలా ఉంటుందా అని అందరూ ఎదురు చూశారు. అయితే ఆయన ఏమీ మాట్లాడలేదు. కిరణ్ సిఎం కాగానే బెంగుళురులో ఉన్న జగన్ హుటాహుటిన హైదరాబాదుకు బయలుదేరారు. ఆయన శుక్రవారం తన ఇంటిలో తన అనుయయులతో భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించినట్లు సమాచారం.
అయితే మీడియాలో జగన్ అధిష్టానం ముందు మూడు డిమాండ్లు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోసు, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలకు మంత్రి పదవులు ఇవ్వాలనేది ఆయన మొదటి డిమాండు కాగా, ఓదార్పుకు ఎలాంటి అడ్డుంకులు సృష్టించవద్దన్నది రెండో డిమాండు. వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన డిఎల్ రవీంద్రారెడ్డి, జెసి దివాకరరెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకోకుడదని ఆయన మూడో డిమాండుగా ప్రచారం జరిగింది. అయితే దానిని జగన్ వర్గం సభ్యులు అంబటి రాంబాబు, శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి ఖండించారు.












Click it and Unblock the Notifications