ఆంధ్ర కంపెనీలతో కెసిఆర్

ప్రైవేట్ కంపెనీల యజమానులు కెసిఆర్ నుంచి స్పష్టమైన ప్రకటనను, వైఖరిని అశించి ఈ సమావేశానికి శ్రీకారం చుట్టినట్లు భావిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుల నుంచైనా ప్రైవేట్ కంపెనీలు సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదని పారిశ్రామిక రంగ వర్గాలంటున్నాయి. తమకు రక్షణ ఉంటుందా, లేదా అనే విషయాన్ని తేల్చుకోవడానికి పారిశ్రామికవేత్తలు కెసిఆర్ ను కలిసినట్లు చెబుతున్నారు. తాము ఉండాలా, లేదా అనేది కూడా వారు తేల్చుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పరిస్థితి ఏమిటనేది కూడా వారు కనుక్కునే ఉద్దేశంతో కెసిఆర్ తో సమావేశమైనట్లు చెబుతున్నారు.
కాగా, పారిశ్రామికవేత్తలతో కెసిఆర్ సమావేశం కావడంపై మా తెలంగాణ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజ్ కృష్ణా ఎదుట ధర్నాకు దిగారు. ఉద్యమాలు చేయడానికి బదులు కెసిఆర్ ఒప్పందాలకు పరిమితమవుతున్నారని వారు విమర్శించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఏమైనా, తెలంగాణకు సంబంధించి కెసిఆర్ పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications