వైయస్ జీవిత చరిత్ర సినిమా రానే రాదా?

Puri Jagannath
వైయస్ మరణించిన కొత్తలో ఆవేశంగా ఆ మహానాయకుడి జీవితాన్ని తెరకెక్కించడానికి స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ముందుకు వచ్చారు. స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తానని ప్రకటించారు. అంతకు ముందే ఆ సినిమా తీస్తామని జీవితా రాజశేఖర్ లు విలేకరుల ఎదుట చెప్పారు. ఎటూ పూరీ వంటి పెద్ద దర్శకుడు తీస్తున్నాడు కాబట్టి వాటా కలుద్దామని ఈ దంపతులు వెళ్ళారు. తాను సొంతంగా ఈ సినిమా నిర్మించాలనుకుంటున్నానని, వాటాలు ఇవ్వబోనని పూరీ స్పష్టం చేశారట. కనీసం వైయస్ పాత్ర అయినా దొరుకుతుందేమోనని భిక్షాపాత్రతో పూరీ చుట్టూ తిరిగిన రాజశేఖర్ కు నిరాశే మిగిలింది. ఇప్పుడీ సినిమా గురించి ఇటు పూరీ కానీ అటు జీవితారాజశేఖర్ లు నోరు మెదపడంలేదు.

సినిమాకు సంబంధించిన పకడ్బందీ కథ పూరీ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా గురించి ప్రకటించిన తర్వాత వైయస్ జగన్ ముందుకొచ్చి డబ్బు పెడతారని, నిర్మాతగా తానే ఉండవచ్చని జగన్నాధ్ భావించినట్టు సినిమా పరిశ్రమలో గుసగుసలు విన్పిస్తున్నాయి. కొన్ని వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాలను నిర్వహిస్తున్న జగన్ పూరీకి బాసటగా నిలిచిఉంటే సినిమాను రిచ్ గా తీయడానికి వీలయ్యేది. పూరీ జగన్నాధ్ అప్పుల్లో ఉన్నారని ఒక వాదన విన్పిస్తుండగా, ఐటి కమ్ము పడకుండా ఆయన అప్పుల్లో ఉన్నానని చెప్పుకోడానికి ఇంటిని ఐదు కోట్లకు కుదువపెట్టినట్టు మరో కథనం.

నేనింతే చిత్రంతో పూరీ బాగా నష్టపోయాడు కాబట్టి కుదవ పెట్టాడని కూడా అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే పూరీ ప్రస్తుతం గోపీచంద్ తో గోలీమార్ అనే చిత్రం చేస్తున్నారు. ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితచరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రియమణి ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఏక్ నిరంజన్ భాక్సాఫీస్ వద్ద కుప్పకూలటంతో ఈసారి తన శక్తి, యుక్తిలన్నిటినీ ఉపయోగించి హిట్ కొట్టాలనే తలంపుతో చేస్తున్నాడంటున్నారు.

ఇక వైయస్ కుటుంబంతో జీవితారాజశేఖర్ లది మరో నిరాశాగాధ. వైయస్ బతికున్నప్పుడే వీళ్ళు కాంగ్రెస్ లోకి దూరిపోయి ఉంటే బాగుండేది. కొన్ని కారణాల వల్ల అలా జరగలేదు. వైయస్ పోయిన తర్వాత కూడా వీళ్ళు క్యాంప్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టారు. ఇప్పుడు వీళ్ళకి కాంగ్రెస్ మీద ఆసక్తి తగ్గిపోయినట్టు కన్పిస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయి ఉంటే పరిస్ధితి వేరుగా ఉండేది. పూరీ తీయకపోయినా వీరైనా వైయస్ మీద సినిమా తీయోచ్చు కదా అని మీరు అడగవచ్చు. దానికి ఆ జంట నుంచి అంత అవసరమా అన్న ప్రశ్న వస్తే?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+