రోబో చిత్రం చివరకు బ్లాక్ టిక్కెట్ల విషయంలోనూ ఓ రికార్డును సృష్టిస్తోంది. ఐదువేల రూపాయలకు ఈ చిత్రం బ్లాక్ టిక్కెట్లలను అమ్మటం చూసి పోలీసులు, ధియోటర్ యాజమాన్యం షాకయ్యారు. ఈ చిత్రం టిక్కెట్ కౌంటర్స్ ను శనివారం చెన్నైలో ఓపెన్ చేసారు. ఈ టిక్కెట్లు కోసం తెల్లవారు ఝామున జామున నాలుగు గంటలకే అభిమానులు థియేటర్ల కౌంటర్ల వద్ద బారులుతీరారు. అభిమానులు రద్దీ అధికం అవడంతోకొన్ని థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తుఏర్పాటు చేయాల్సి వచ్చింది. చెన్నై సత్యం థియేటర్ ఉదయం కాంప్లెక్స్ వద్ద అర గంటలోనే వారంరోజలకు సరిపడా టికెట్లు అమ్ముడైపోయాయి. అదేవిధంగా అమీర్ థియేటర్ లోబుకింగ్ ప్రారంభమైన 20 నిమిషాలకే వారంరోజుల టికెట్లు విక్రయించారు. చెన్నైలోని సత్యం, ఐనాక్స్, పీవీయార్ తదితర 32థియేటర్లలో ఇంచుమించు ఒక గంట వ్యవధిలోవారం రోజులకు టికెట్లు బుకింగ్ పూర్తయిపోయింది. దాంతో బ్లాక్ టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పోలీసులు కొంతమందిని పట్టుకుని అరెస్టు చేసినా ఫలితం లేకుండా పోయింది.