ఉక్కు మనిషిగా ముందుకెళ్తున్న రోశయ్య

ఇప్పుడున్న మంత్రుల్లో కనీసం ఆరుగురుని తొలగించి, కొత్తగా 16 మంది మంత్రులను తీసుకోడానికి రోశయ్య గేమ్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఆయనకు సన్నిహితులైన వారు ఈ పథకాన్ని రచించి రోశయ్యతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 2 నుంచి జగన్ తన తండ్రి వైఎస్ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాల కోసం "ఓదార్పు" యాత్ర నిర్వహించబోతున్నారు. అందుకు హైకమాండ్ అనుమతి కోరినా ఇప్పటి వరకు జవాబు లేదు. రోశయ్యకు జగన్ చెవిలో జోరీగలాగా, కంట్లో నలుసులాగా పరిణమించారు. అయితే జగన్ శిబిరంలో రోశయ్య శిబిరంలో కంటే తలపండిన మేధావులు ఉన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా రోశయ్య మంచి సలహాదారులను పెట్టుకోలేకపోయారు. ఆయన "దైవాధీనం- మోటారు సర్వీసు" లా ప్రభుత్వ బండిని లాగిస్తున్నారు.
మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ జరిగిన తర్వాత రోశయ్య సూపర్ మ్యాన్ గా ఆవిర్భవించవచ్చు. అందుకే అసలు మంత్రివర్గ విస్తరణ జరగకుండా జగన్, జగన్ యాత్రలు జరగనివ్వకుండా రోశయ్య వ్యూహాలు వేసుకుంటున్నారు. అంత పెద్ద మనిషితో పెట్టుకోకుండా గౌరవంగా ఉండాలన్న మంచి బుద్ధి జగన్ కు లేదు. ఇంత చిన్న పిల్లాడిని ఆడుకోనివ్వాలి కానీ అడ్డుకోకూడదన్న పెద్ద బుద్ధి రోశయ్యకు లేదు. రాష్ట్రంలో రోశయ్య, జగన్ తప్ప మరో నాయకుడు లేడన్న పరిస్ధితి నెలకొంది. ఈ పోరులో ఏ డిఎస్ లాంటి వారో ముఖ్యమంత్రి పదవిని ఎగరేసుకుపోయే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications