చిరంజీవికి సోనియా తాయిలం!

చిరంజీవికి రాష్ట్రంలో 18 శాతం ఓట్ బ్యాంకు ఉంది. అది వచ్చే ఎన్నికల్లో ఇంకా పెరిగే అవకాశముంది. కాపులే కాకుండా తన అభిమానులను చిరంజీవి తన ఓట్ బ్యాంకుగా మార్చుకున్నారు. రాజశేఖరరెడ్డి చాలా పవర్ ఫుల్ స్కీములు పెట్టి ప్రజల ముందుకు వెళ్ళడంతో చిరంజీవికి ఉన్న బలం సరిపోలేదు. 18 అసెంబ్లీ స్ధానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెసుతో కలిసే అవకాశముంది. సోనియా గాంధీ అతనికి చాలా పవర్ ఫుల్ ఆఫర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెసుతో కలిస్తే రాష్ట్రంలో చాలా మార్పులు వస్తాయి. ఈ పరిణామం చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోంది, వచ్చే ఎన్నికల్లోచంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికే సోనియా గాంధీ ఈ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications