• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాగార్జున ప్లాన్స్ కు తెలంగాణ అడ్దంకులు!

By Santaram
|

Nagarjuna
హైదరాబాద్: హీరో నాగార్జునకు అనేక విధాలుగా కష్టాలు వచ్చిపడుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ను ఆయన మల్టిపుల్ గా అభివృద్ధి చేసి, వరల్డ్ క్లాస్ స్టూడియోగా, కమర్షియల్ సెంటర్ గ అమార్చాలనుకున్నాడు. ఆయన బిజినెస్ సెన్స్ చాలా గొప్పది. విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన కళ్ళు అప్పజెప్పిచూడకుండా మనసు విప్పి చూస్తాడు. తన వ్యాపార సృజనాత్మకతను పెంపొందించుకుంటాడు.

అలాగే అదే పద్ధతిలో అతను అన్నపూర్ణ స్టూడియోను అభివృద్ధి చేయాలనుకున్నాడు. అసలే ఎత్తుగా ఉన్న అన్నపూర్ణ స్ధలంలో ఎత్తైన బిల్డింగ్ కట్టాలంటే ఏవియేషన్ నిబంధనలు అడ్డు వస్తున్నాయి. తెలంగాణ అంశం కూడా అడ్డు పడింది. వైఎస్ మరణించడం కూడా నాగార్జునకు దెబ్బకొట్టింది. వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల ముందు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన నాగార్జున అనేక తాయిలాలను వైఎస్ నుంచి ఆశించారు. బతికి ఉంటే వైఎస్ వాటిని ఇచ్చి ఉండేవారు. వైఎస్ బతికి ఉంటే తెలంగాణ సమస్య కూడా ఇంత తీవ్రం అయ్యేది కాదు.

అన్నమయ్యగా వెంకటేశ్వరస్వామిని, రామదాసుగా శ్రీరాముడిని ఆరాధించిన నాగార్జున వైఎస్ ను దైవంగా చేసుకుని ఒక సినిమాలో నటిస్తే బాగుంటుందేమో. జగన్ సిఎం అయి ఉంటే వ్యాపార ప్రయోజనాల కోసమైనా నాగార్జున అటువంటి సినిమా తీసి ఉండేవాడు. తనకు రాజకీయాలు ఇష్టం లేకపోయినా వైఎస్ వంటి ముఖ్యమంత్రి మంచి పథకాలను అమలు చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడడంలో తప్పేమిటని ఆయన ఆనాడు ప్రశ్నించారు. తనవంటి బిజినెస్ మనుషులు ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉండడంలో తప్పులేదని ఆయన సమర్ధించుకున్నారు.

తండ్రి అక్కినేని నాగేశ్వరరావు మంచి ఆస్ధులు సంపాదించుకోవడంపై ఆనాడు దృష్టి పెట్టగా నాగార్జున ఆస్ధులు నిరుపయోగంగా మిగిలిపోకుండా వాటిని ఫారిన్ స్టైల్ లో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అంతేగాకుండా హీరోగా తనకు వస్తున్న భారీ ఆదాయంతో ఆయన గచ్చిబౌలి, మణికొండ, కోకాపేట వంటి ప్రాంతాల్లో పదిహేనేళ్ళ నుంచి పొలాలు కొనడం ప్రారంభించారు. అవి కొన్ని వందల రెట్లు పెరిగాయి. ఈమధ్య తెలంగాణ ఉద్యమం ఉదృతం కావడంతో ఆ భూముల రేట్లు కొంచెం తగ్గాయి.

టెయిల్ పీస్: పైన చెప్పిన ప్రాంతాల్లోని ఒక ఎకరం పొలాన్ని తెలంగాణ నేపద్యంలో నాగార్జున ఇటీవల అమ్మినట్టు తెలుస్తోంది. దాదాపు ఇరవై కోట్ల రూపాయలకు కొనడానికి కొందరు ముందుకు వచ్చి అడ్వాన్సు ఇచ్చారు. పూర్తి మొత్తం ఇవ్వాల్సిన రోజున కొనుగోలుదారు సెల్ ఫోన్లు లిఫ్ట్ చేయలేదు. తెలంగాణ ఎఫెక్ట్ వల్ల వారు వెనక్కి వెళ్లిపోయారేమోనన్న అనుమానం నాగార్జునకు వచ్చింది. ఆ డబ్బును మరో వ్యాపారంలోకి మళ్ళించడం ఆయన ఊద్దేశం. ఆ టెన్షన్ లో ఆయన ఒకరోజంతా గడిపాడట. చివరికి కొనుగోలుదారులు పెద్ద పెట్టెల్లో ఫ్రూట్స్ మద్య దాచి ఆడబ్బు ను పువ్వుల్లో పెట్టినట్టు నాగార్జునకు అందజేశారట. ఐటి వాళ్ళకి, దొంగలకు దొరక్కుండా ఉండడానికే ఫోన్లు లిఫ్ట్ చేయలేదని వారు చెప్పినప్పుడు నాగార్జున ఆనందంగా నవ్వుకుని రిలీఫ్ ఫీలయ్యాడట.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X