టిఎస్ఆర్ వివాదాల పుట్ట

కృష్ణా నదిపై స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలతో టి. సుబ్బిరామిరెడ్డి వెలుగులోకి వచ్చారు. నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణం కాంట్రాక్టు తీసుకున్న రామచంద్రారెడ్డి వద్ద ఆయన కోద్ది పాటి జీతంతో పైచిలుకు లేబర్ వ్యవహారాలు చూసే ఉద్యోగిగా చేరారు. టిఎస్ఆర్ ది నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామం. హాస్యనటుడు రమణారెడ్డిది కూడా అదే గ్రామం. తీవ్రమైన పేదరికంతో టిఎస్ఆర్ అలమటించేవారు. రామచంద్రారెడ్డి వద్ద చేరిన తర్వాత రూ. 300 వేతనంతో మేనేజర్ గా పదోన్నతి పొందారు. 1974 నుంచి ఆయన జాతకం మారింది. ఆయన కాంట్రాక్టరుగా రూపాంతరం చెందారు. నాగార్జున సాగర్ కాలువల నిర్మాణానికి చెందిన వివిధ కాంట్రాక్టులను ఆయన పొందారు. ఆ కాలువల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గాయత్రీ కన్ స్ట్రక్షన్స్ స్థాపించి కాంట్రాక్టులు చేజిక్కించుకోవడం మొదలు పట్టారు. నాగార్జున సాగర్ కాలువల నిర్మాణాలకు చెందిన సిమెంటును హైదరాబాదుకు తరలించి ఆయన థియేటర్లను నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాలపై అప్పట్లో విజిలెన్స్ కమిషనర్ థామస్ ఆయనపై అరెస్టు వారంట్ కూడా జారీ చేశారు. ఆ సమయంలో టిఎస్ఆర్ అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఇంట్లో దాక్కున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై శాసనసభలో తీవ్ర రభస కూడా జరిగింది.
ఆ తర్వాత విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన కాంట్రాక్టులను కూడా సుబ్బిరామిరెడ్డి దక్కించుకున్నారు. అప్పటికే హైదరాబాదులో పాగా వేసిన ఆయన విశాఖపట్నంలో పాగా వేయడానికి ఆలయాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. పెళ్లిళ్లలో జంటలకు తాళిబొట్లు ఉచితంగా ఇచ్చారు. క్రికెట్ కిట్లు పంచిపెట్టారు. ఆ రకంగా ప్రజలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. మెల్లగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కాంగ్రెసు పార్టీని తనకు వేదికగా మార్చుకున్నారు. అయితే, స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎందుకో గాని ఆయనను దూరం పెట్టారు. రెండుసార్లు విశాఖపట్నం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు దగ్గరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమితులయ్యారు. టిటిడి చైర్మన్ గా ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం పది కోట్ల రూపాయలకు చెందింది. అయినా ఆయన బయట పడ్డారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కూడా చేరారు. అయితే, దాసరి నారాయణ రావుతో పాటు టి. సుబ్బిరామిరెడ్డిని మన్మోహన్ సింగ్ మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇప్పుడు ఆయన మళ్లీ మంత్రివర్గంలో చేరడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారా అనేది అనుమానంగా ఉంది.
గాయత్రీ ఉపాసన చేసే టి. సుబ్బిరామిరెడ్డి కళా బంధువుగా పలు సంస్థలకు సాయం అందిస్తారని సమాచారం. బాలీవుడ్, టాలీవుడ్ నటులకు బహుమతులు ఇవ్వడం, వారికి సన్మానం చేయడం కూడా ఆనవాయితీగా సాగిస్తూ వచ్చారు. ఆ రకంగా ఆయన తనకు ఏ రూపంలో వ్యతిరేకత రాకుండా చూసుకున్నారని అంటారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications