జగన్ పై రాహుల్ కు కోపమెందుకు?

Rahul Gandhi
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి, అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోపం ఎందుకుండాలనే ప్రశ్న ఉదయిస్తోంది. జగన్ ఓదార్పు యాత్ర చేస్తే తప్పేమిటనే సందేహం కూడా కలగడం సహజం. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే కొంచెం లోతుగా వెళ్లాల్సిందే. జగన్ తమను బ్లాక్ మెయిల్ చేసి, అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడనేది వారి ప్రధాన అభిప్రాయంగా చెప్పవచ్చు. సోనియా గాంధీ కఠినంగా వ్యవహరిస్తున్న సమయంలో కూడా రాహుల్ జగన్ పట్ల కాస్తా ఉదారంగానే వ్యవహరించారని అంటారు. అయితే, ఆ తర్వాత జగన్ వర్గానికి చెందిన శాసనిసభ్యులతో మాట్లాడిన తర్వాత, జగన్ వ్యవహారాలనూ ప్రసంగాలనూ క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత రాహుల్ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. జగన్ ను సహించడం సాధ్యం కాదనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు సమాచారం.

కాగా, జగన్ వ్యవహార శైలే అనుమానాస్పదంగా ఉంది. పావురాలగుట్టలో జరిగిన వైయస్ స్మృతి సభలో జగన్ పార్టీ పేరును గానీ పార్టీ అధ్యక్షురాలు సోనయా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ హైదరాబాదు వచ్చిన పరామర్శించిన విషయాన్ని గానీ ఆయన ప్రస్తావించలేదు. పైగా, వైయస్ శవం అక్కడ ఉండగానే ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ వర్గీయులు ప్రయత్నాలు ప్రారంభించారు. మద్దతు కోసం ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వద్దకు కూడా వెళ్లారు. నిజానికి, కొంత సమయం వేచి ఉండి, అధిష్టానానికి విన్నవించుకుంటే ఫలితం ఏమైనా ఉండేదేమో.

అదలా ఉంటే, జగన్ తన ఓదార్పు యాత్రలో ఎక్కడ కూడా కాంగ్రెసు పార్టీ గురించి మాట్లాడడం లేదు. సోనియా, మన్మోహన్ సింగ్ ల పేర్లు ప్రస్తావించడం లేదు. తన తండ్రి పార్టీతోనూ ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రజాబాంధవుడుగా ఎదిగాడని, వైయస్ కు దక్కాల్సిన ఫలితమంతా తనకు దక్కాలని, కాంగ్రెసుకు దక్కకూడదనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా, జగన్ పైకి చెప్పేది ఏమైనా లోలోపల శాసనసభ్యులను కూడగట్టుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వీలు చిక్కితే తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి కావాలనే కోరిక జగన్ లో ఉందనేది రాహుల్ గ్రహించినట్లున్నారు.

వాటన్నింటినీ పక్కన పెడితే, ప్రధానమైన విషయమేమింటంటే - జగన్ పార్టీ పెడతారని చాలా కాలంగా ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి. ఆ ఊహాగానాలను ఆయన ఏ సందర్భంలోనూ ఖండించలేదు. ప్రకాశం జిల్లా శాసనసభ్యులు అడిగినా ఆయన సమాధానం చెప్పలేదు. దీన్ని బట్టి పార్టీ పెట్టాలనే ఆలోచనలోనే జగన్ ఉన్నట్లు సోనియా, రాహుల్ గాంధీ, అధిష్టానానికి చెందిన నాయకులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. జగన్ ను పొమ్మనలేక, పొగ పెట్టడానికి ప్రధాన కారణం ఇదేనని అంటున్నారు. పార్టీ పెట్టే యోచన లేకపోతే, కాంగ్రెసుతోనే ఉండాలనుకుంటే పార్టీ పెడతారనే ప్రచారాన్ని ఆయన ఖండించి ఉండేవారనేది ముఖ్యమైన విషయంగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+