వైయస్ జగన్ కు కరపత్రం బెడద

వైయస్ కుటుంబంలో ఐక్యత కోసం వివేకానంద ఎంతో త్యాగం చేశారని ఆ కరపత్రంలో పేర్కొన్నారు. జగన్ కోసం వివేకానంద పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకున్నారన్నారు. వైయస్ కుటుంబంలో జగన్ కు తప్ప ఎవరికి పదవి ఇచ్చినా కుటుంబాన్ని చీల్చడమే ఆయన ఉద్దేశ్యమా అని ప్రశ్నించారు. వైయస్ వివేకానందకు ఒక్కరోజులోనే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అపాయింట్ మెంటు ఇచ్చిందనడంలో వాస్తవం లేదని, అయితే పులివెందుల ఉప ఎన్నికలకు ముందు సోనియాగాంధీ దివంగత వైయస్ సతీమణి విజయలక్ష్మికి ఒక్కరోజులోనే అపాయింట్ మెంటు ఇచ్చారన్నారు. ఆయా సందర్భాల్లో వచ్చిన పరిస్థితిని బట్టి సోనియా అపాయింట్ మెంటు ఇస్తుందన్నారు.
జగన్ ముఖ్యమంత్రి కావాలని అనుకోవటంలో తప్పులేదని, అయితే ఆయనకు మరింత రాజకీయ అనుభవం అవసమరమని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఓదార్పును వద్దని చెప్పలేదన్నారు. అయితే దానిని రాజకీయ వేడుకగా మాత్రమే మార్చవద్దని చెప్పారు. వైయస్ కుటుంబంలో జగన్ కు తప్ప మరెవరికీ పదవి వచ్చినా కుటుంబాన్ని చీల్చుతారా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మీద అభిమానంతో మంత్రులు, శాసనసభ్యులు వైయస్ మృతి తర్వాత జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని సంతకాలు చేశారని పేర్కొన్నారు. తండ్రి మృతి చెందిన తర్వాత పార్టీని అస్థిర పరచడానికి జగన్ ప్రయత్నాలు చేశారన్నారు.
ఎంపీగా గెలిచిన తర్వాత ఒక్కసారి నియోజకవర్గంలో పర్యటించకపోవటం, సమావేశాలు ఏర్పాటు చేయక పోవటంతో జగన్ పార్టీలో ఉండి మళ్లీ అధికారంలోకి తెచ్చిన ఫలితం ఉండదని ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. తాను ఆశించిన ముఖ్యమంత్రి పదవి రాలేదనే, తాను అనుకున్న తీరులో ఓదార్పు జరగనివ్వలేదని జగన్ రాజీనామా చేశారని ఉంది. చివరలో నిగర్వి, ప్రజా సంక్షేమం పట్ల నిబద్దత కలిగిన వివేకానందను అందరూ బలపర్చాలని అందులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications