జగన్ వర్గ ఎమ్మెల్యేలపై చర్యలు?

నలుగురు పార్టీ శాసనసభ్యులకు ప్రస్తుత స్పీకర్, అప్పటి డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నోటీసులు జారీ చేసి, ఇరు వర్గాల వాదనలు విన్నారు. వారి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారిపై చర్యల తర్వాత మరింత మంది శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం సమావేశమైన జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఎటుండాలో తేల్చుకోవాలని, రెండు వైపులా ఉండకూడదని బొత్స సత్యనారాయణ కొంత మంది జగన్ వర్గం శాసనసభ్యులకు ఇప్పటికే సలహా ఇచ్చారు. దారికి రాని శాసనసభ్యులపై వెంట వెంట చర్యలు తీసుకోవడమే మంచిదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. శాసనసభ వర్షాకాలం సమావేశాల నాటికి శాసనసభ్యుల వ్యవహారం తేలిపోవాలని బొత్స సత్యనారాయణ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications