వైయస్ జగన్ ఆస్తులే అందరి టార్గెట్

YS Jagan
అధికార, ప్రతిపక్షాలతో తేడా లేకుండా అన్ని పార్టీలు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అస్తులపైనే పడుతున్నాయి. లక్షల కోట్ల రూపాయలు వైయస్ జగన్ ఎలా సంపాదించాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో సహా కాంగ్రెసు నాయకుడు వి. హనుమంత రావు కూడా ప్రశ్నిస్తున్నారు. తాజాగా కాంగ్రెసు నాయకుడు వి. హనుమంత రావు జగన్‌పై కొత్త ఆరోపణ చేశారు. ఢిల్లీకి వైయస్ జగన్ డబ్బుల సూట్‌కేసులు మోశారని ఆయన ఆరోపించారు. వైయస్ జగన్ అవినీతిపై సమయం వచ్చినప్పుడు విచారణ జరిపిస్తారని ఆయన అన్నారు. వైయస్ జగన్ పెద్ద యెత్తున ముందస్తు పన్ను చెల్లించడంతో జగన్ ఆస్తులకు సంబంధించిన వ్యవహారంపై వివాదం మొదలైంది. జగన్ దాదాపు 83 కోట్ల రూపాయల ముందస్తు పన్ను చెల్లించారు. దాని ప్రకారం చూస్తే వైయస్ జగన్ వార్షికాదాయం 250 కోట్ల రూపాయల దాకా ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.

దివంగత నేత వైయస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ తీవ్రమైన అక్రమాలకు పాల్పడి పెద్ద యెత్తున సొమ్ము చేసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. నిజానికి, వైయస్ జగన్ అనతి కాలంలోనే అనూహ్యంగా ఎదిగారు. పలు సంస్థలను స్థాపించారు. పెద్ద యెత్తున సాక్షి మీడియాను ముందుకు తెచ్చారు. సాక్షి మీడియా ద్వారా చంద్రబాబుపై, కాంగ్రెసుపై తీవ్రంగా దాడి చేస్తున్నారు. సాక్షి మీడియా దాడిని తట్టుకోలేని నేతలు జగన్ అవినీతి, అక్రమాలను ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. సాక్షి మీడియాను బహిష్కరిస్తున్నట్లు వి హనుమంత రావు ప్రకటించారు. ప్రతి మీడియా సమావేశంలోనూ విహెచ్ సాక్షి మీడియా ప్రతినిధులతో వివాదానికి దిగుతూనే ఉన్నారు.

వైయస్ జగన్‌పై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం వెనక్కి తగ్గారు. అలా వెనక్కి తగ్గడానికి కారణాలేమిటో తెలియడం లేదు. అయితే, ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు తన ఆస్తులపై చేస్తున్న ఆరోపణలపై జగన్ ఏమీ మాట్లాడడం లేదు. ఆయన వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గోనె ప్రకాశ రావు ఆ ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వైయస్ జగన్ ఆస్తుల వివాదం ఏ మలుపు తీసుకుంటుందో ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+