చిరంజీవి వర్సెస్ వైయస్ జగన్

Chiranjeevi-Ys Jagan
రాష్ట్ర రాజకీయాలు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వర్సెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌గా మారే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది. ఇందుకు తగిన ఫార్ములానే కాంగ్రెసు పార్టీ అధిష్టానం రూపొందించి అమలు చేస్తోంది. చిరంజీవిని పార్టీలోకి తెచ్చిన తర్వాత తెలంగాణ అంశంపై కాంగ్రెసు దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెసు ఇస్తుందనే నమ్మకం దాదాపుగా సన్నగిల్లింది. తెలంగాణ అంశాన్ని పరిష్కరించి చిరంజీవి తెలంగాణలో తిరిగేందుకు అవసరమైన వాతావరణాన్ని కాంగ్రెసు అధిష్టానం కల్పించాల్సి ఉంటుంది. తెలంగాణపై ప్రశ్నించినప్పుడు సోనియా నిర్ణయం వెలువడిన తర్వాత చూస్తామని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య చెప్పారు. తెలంగాణ విషయంలో చిరంజీవికి హామీ ఇచ్చిందా అనే ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. సమైక్యవాదానికే చిరంజీవి కట్టుబడి ఉన్నారు. అందువల్ల తెలంగాణ ఏర్పాటు అనేది వెనక్కి వెళ్లిపోయినట్లేనని భావిస్తున్నారు. అయితే, తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు ఎలా పరిష్కరిస్తుందనేది ఉత్కంఠగానే ఉంది.

కాగా, చిరంజీవిని తొలుత వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయించి, కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. విలీనం ఒకవేళ తక్షణమే జరగకపోయినా మిత్రపక్షాలుగా ఆ దిశగానే ముందుకు సాగే అవకాశాలున్నాయి. దీంతో కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవిని 2012లో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా చేసి ఎన్నికల బరిలోకి దింపుతారని అంటున్నారు. తెలంగాణలో చిరంజీవి తిరిగే వాతావరణం ఏర్పడితే వైయస్ జగన్‌కు కూడా ఆ అవకాశం లభిస్తుంది. దీంతో సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలోనూ రాజకీయం చిరంజీవి వర్సెస్‌ జగన్‌గా మారుతుందని అంటున్నారు.

సీమాంధ్రలో వైయస్ జగన్ ప్రభావం వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జురగుతుందని, చిరంజీవి వల్ల తమ క్యాడర్ కదలబోదని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, కాంగ్రెసు, వైయస్ జగన్ మధ్య ఓట్లు చీలి తమకు లాభం చేకూరుతుందని తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నారు. అలాంటి నష్టం జరగకుండా చిరంజీవి కాపాడుతారనేది కాంగ్రెసు అధిష్టానం నమ్మకంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలంగాణలో దాదాపుగా రూపుమాసిపోయిందని అనుకుంటున్నారు. నాయకులు తప్ప క్యాడర్ లేదని భావిస్తున్నారు. అందువల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి పోటీ ఎదురవుతుందని అంటున్నారు. అయితే, చిరంజీవి ఆపరేషన్ పూర్తయిన తర్వాత తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌తో కాంగ్రెసు అధిష్టానం వ్యవహారం నడుపుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వ్యవహారం ఎలా ఉంటుందని, కెసిఆర్‌ను తమకు ఎలా అనుకూలంగా మార్చుకుంటుందనేది ఆసక్తికరమైన విషయమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+