వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అరెస్టుకు సిబిఐ సన్నాహాలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం దాదాపు సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని వార్తా ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. అవినీతి, మనీలాండరింగ్ చట్టం, నిధుల తరలింపు, చీటింగ్, నమ్మక ద్రోహం కుట్ర కేసులతో సహా ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్‌ల క్రింద పోలీసులు జగన్‌ను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్ ఆస్తుల కేసు విషయంలో సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జగన్ ఆస్తుల కేసు విషయంలో ఇరవై మందిని ప్రథమ ముద్దాయిలుగా సిబిఐ చేర్చింది. ఆస్తుల వ్యవహారంలోని కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ ఎ-1లో జగన్‌ను ప్రథమ ముద్దాయిగా చేర్చింది. గురువారం ఉదయం నుండి జగన్‌కు చెందిన జగతి పబ్లికేషనస్, ఇందిరా టెలివిజన్, భారతి సిమెంట్స్, సండూరు పవర్ ప్రాజెక్టు తదితర కంపెనీలతో పాటు, ఆయన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారి కంపెనీలపై, వారి ఇళ్లపై, నాటి ప్రభుత్వ అధికారుల ఇళ్లపై సిబిఐ అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ దాడులలో సిబిఐ అధికారులు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులోని జగన్ ఇంట్లో మధ్యాహ్నం సిబిఐ సోదాలు పూర్తయ్యాయి. సాక్షి కంపెనీలో సైతం సిబిఐ అధికారులు కీలక డాక్యుమెంట్లు, హార్డు డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం జగన్ ఆస్తులలో అక్రమంగా పెట్టుబడులు ఉన్నట్టు సిబిఐ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో జగన్‌కు చిక్కులు తప్పేలా లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్‌పై పెట్టిన కేసులలో 120(బి) అత్యంత తీవ్రమైనదిగా న్యాయనిపుణులు భావిస్తున్నట్లు సమాచారం. జగన్ ఇంట్లో సోదాలు పూర్తయిన అనంతరం అధికారులు సీజర్ రిపోర్టు తయారు చేసే పనిలో పడ్డారు. మొత్తానికి సిబిఐ దాడుల తర్వాత జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదని పలువురు భావిస్తున్నారు. వైయస్సార్సీ పార్టీ నాయకులు సైతం జగన్ అరెస్టును కొట్టి పారేయలేక పోతున్నారు.

జగన్ కేసుతో పాటు ఎమ్మార్ అక్రమాల వ్యవహారంలో సంబంధం గల అధికారులపై గురువారం సిబిఐ దాడులు నిర్వహించింది. బిపి ఆచార్యతో పాటు నాటి ఎమ్మార్ అధికారుల ఇళ్లపై సిబిఐ దాడులు నిర్వహించింది. ఎమ్మార్‌లో అక్రమాల విషయంలో నాటి ఎమ్మార్, ఎపిఐఐసి అధికారులను సిబిఐ అరెస్టు చేసే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. విజిలెన్సు నివేదికలోని అంశాలు సైతం ఇందుకు కీలకంగా మారనున్నాయి. బిపి ఆచార్య, పార్థసారథి, శ్రీకాంత్ జోషి, విజయ రాఘవన్, శ్రావణ్ గుప్తా తదితర అధికారుల అరెస్టుకు అవసరమైన సాక్ష్యాలు సిబిఐ సేకరించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం నష్ట పోవడానికి కారకులైన అధికారులందరికీ తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. సిబిఐ దాడులలో బిపి ఆచార్య ఇంట్లోనూ పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

English summary
It seems, CBI officers will be arrest YSRC party president YS Jaganmohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X