బాబు వ్యూహం: జగన్ బలాన్ని తేల్చేయడానికే?

అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, కొంత మంది శాసనసభ్యులు అందుకు సిద్ధపడడం లేదని అంటున్నారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆదినారాయణ రెడ్డి తాము ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తామని చెప్పారు. అందువల్ల జగన్ వర్గం శాసనసభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తారని, దాని వల్ల ప్రభుత్వం నిలబడిపోతుందని, మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోకూడదనే తన ఉద్దేశం నెరవేరుతుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. తెరాస శాసనసభ్యులు కూడా కొంత మంది క్రాస్ వోటింగుకు పాల్పడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాము అవిశ్వాసం ప్రతిపాదించడం ద్వారా కెసిఆర్, వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారనే చేస్తున్న విమర్శలకు బలం చేకూరుతుందని, దానివల్ల ప్రజల్లో తమపై విశ్వాసం పెరుగతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ వర్గానికి చెందిన ముగ్గురు శాసనసభ్యులు అధికార కాంగ్రెసుకు తిరిగి వచ్చారు. ఇంకా మరికొంత మంది తిరిగి రావచ్చునని కూడా ప్రచారం జరుగుతోంది. ఏమైనా, ఇది జగన్‌కు పరీక్షలాంటిదేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications