కెసిఆర్‌పై నమ్మకం పోతోందా?

కాంగ్రెసు పార్టీని నమ్ముకోవడం వల్లనే కెసిఆర్‌పై తెలంగాణ ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుందనే అభిప్రాయం ఉంది. అది కూడా, కాంగ్రెసులోని కొంత మందిని ఆయన నమ్ముకున్నట్లు చెబుతున్నారు. వారి ఒత్తిడితో తెలంగాణ సాధించగలననే నమ్మకం కెసిఆర్‌కు ఉందని అంటున్నారు. అయితే, దానివల్లనే కెసిఆర్ వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టి, పార్టీని బలోపేతం చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, తెలంగాణ సాధించడం ఆయనకు అప్రధానంగా మారిందనే అభిప్రాయం బలపడుతోందని అంటున్నారు. కాంగ్రెసును నమ్ముకోవడం వల్లనే కెసిఆర్ ఎప్పటికప్పుడు తప్పులో కాలేస్తున్నారని అంటున్నారు. అందువల్లనే తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఇటీవలి ప్రకటన కొంత వివాదాస్పదంగా మారింది. తనకు కాంగ్రెసుపై నమ్మకం లేదని, తెలంగాణ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెసు ఉందని ఆమె అన్నారు. కెసిఆర్ వ్యూహంలోని తప్పిదాన్ని ఆమె పరోక్షంగా ఎత్తి చూపారు.
తమతో రాజీనామాలు చేయించి, మధ్యంతర ఎన్నికలకు దారి తీయించే ఎత్తుగడతో కెసిఆర్ ఉన్నారని కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యంతర ఎన్నికలు రాకపోయినా, సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లకు ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని కూడా కెసిఆర్ భావిస్తున్నట్లు వారు చెబుతున్నారు. అందువల్లనే రాజీనామాలపై తీవ్రంగా ఒత్తిడి పెట్టిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులను రాజీనామాలు చేసేలా కెసిఆర్ రెచ్చగొడుతున్నారని చెబుతున్నారని అంటున్నారు. ఏమైనా, కెసిఆర్ పరిస్థితి ముందుకు వెళ్లలేని, వెనక్కి రాలేని విధంగా తయారైంది.












Click it and Unblock the Notifications