వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు దీదీని అడ్డం వేస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీని అడ్డం వేసే వ్యూహాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. గూర్ఖాలాండ్ తరహాలో తెలంగాణ సమస్యను పరిష్కరించాలనే అభిప్రాయాన్ని దీదీ గతంలో ఓసారి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు కాకుండా తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాలున్నాయని ఆమె అప్పట్లో చెప్పారు. అది గూర్ఖాలాండ్ తరహా పరిష్కారమనే విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల తెలంగాణకు దీదీని అడ్డం వేయాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెసు అధిష్టానం తన వైఖరిని చెప్పే అవకాశం ఉంది. యుపిఎ భాగస్వామ్య పక్షాల అభిప్రాయం కావాలని చెప్పవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ రాష్ట్రస్థాయి చర్చలు పూర్తయ్యాయని జాతీయ స్థాయిలో సంప్రదింపులు జరపాల్సి ఉందని చెప్పారు. జాతీయ స్థాయి పార్టీల అభిప్రాయ సేకరణ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దీదీ వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెసు అధిష్టానం వెనక్కి నెట్టే అవకాశం ఉంది. తమకు 2014 ఎన్నికల్లో పూర్తి మెజారిటీ వస్తే, భాగస్వామ్య పక్షాల ఒత్తిడి లేకపోతే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు అధిష్టానం స్పష్టం చేసే అవకాశాలున్నాయి.

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాత్రను మమతా బెనర్జీ పోషించే అవకాశాలున్నాయి. సమస్య నుంచి గట్టెక్కడానికి కాంగ్రెసు అధిష్టానం అది తప్ప మరో మార్గం కనిపించడం లేదని అంటున్నారు. కాంగ్రెసు వైఖరి అనుకూలంగానూ యుపిఎ వైఖరి అస్పష్టంగానూ తెలంగాణపై వెలువడే అవకాశాలున్నాయి. యుపిఎ భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయానికి కృషి చేస్తామని కాంగ్రెసు అధిష్టానం తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చునని అంటున్నారు.

English summary
It is learnt that Congress high command may use Mamata Banerjee stand on Telangana issue to postpone it further.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X