ఎన్నాళ్లకెన్నాళ్లకు!: రాష్ట్రంపై అధిష్టానం దృష్టి

Andhra Pradesh
చాలా రోజుల తర్వాత రాష్ట్రంలోని కాంగ్రెసు పార్టీలో సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. చాన్నాళ్లుగా నాన్చుతూ వస్తున్న డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవుల భర్తీతో పాటు పీసీసీ సారథ్య బాధ్యతలను కొత్త నేతకు అప్పగించే దిశగా కూడా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు మొదలెట్టింది. ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాం«ధీని శనివారమిక్కడ కలిశారు. పార్టీ వ్యవహారాలు, తెలంగాణ అంశాలపై ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్ వంటి కోర్‌కమిటీ సభ్యులతో శుక్రవారం చర్చించిన సీఎం.. సోనియాతో జరిపిన సమావేశంలోనూ ఆ అంశాలను ప్రస్తావించేందుకు యత్నించారు. ఉప ఎన్నికల తరువాత పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుడదామని సీఎంకు సోనియా ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే సీఎంతో సమావేశానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు జె.పి.అగర్వాల్‌లు సోనియాతో సమావేశమయ్యారు.

గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. వీరిద్దరి మధ్య తలెత్తిన ఎన్ఎండీసీ వివాదం పరిష్కారంలో అలసిపోయిన సోనియా.. సీఎం కిరణ్‌తో జరిగిన భేటీలో.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కూలంకషంగా మాట్లాడలేకపోయారు. ఈ భేటీలో కడప ఉప ఎన్నికల గురించే ప్రస్తావనకు వచ్చిందని ఇతర అంశాలపై పెద్దగా చర్చ జరగలేదని పార్టీ వర్గాల వివరించాయి. కడప ఫలితాల తర్వాత సీఎం కిరణ్ మరో మారు ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ సందర్భంగా.. సంస్థాగత అంశాలపై అధిష్ఠానం దృష్టి సారించనుంది. కాగా.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆదివారం ఢిల్లీ వెళ్తున్నారు.

ఈ భేటీలో వీరు రాష్ట్ర వ్యవహారాలపై సమగ్రంగా చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం రేసులో అగ్రస్థానంలో రాజనర్సింహ! ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇన్నాళ్లూ తనమునకలైన కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటుండడంతో.. రాష్ట్ర రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణ అంశంపై అటో ఇటో తేల్చాలన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అధిష్ఠానానికి ఇచ్చిన అల్టిమేటం.. దానిపై మే రెండో వారంలో మళ్లీ భేటీ అవుదామంటూ ఢిల్లీ పెద్దలు ఇచ్చిన హామీలపై అధిష్ఠానం దృష్టిసారించనున్నది.

స్పీకర్, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో నిర్ణయం తీసుకోవాలన్న దృఢ నిర్ణయంలో అధిష్ఠానం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సమయంలో అప్పటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ.. తెలంగాణ ప్రాంతానికి చెందినవారికి డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ పదవి లభిస్తుందనీ స్పష్టం చేశారు. దీంతో ఈ పదవిలో మంత్రులు జె.గీతారెడ్డి, దామోదర్ రాజనర్సింహల పేర్లు నాడు ప్రముఖంగా విన్పించాయి. అయితే.. వీరిలో రాజనర్సింహ వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోందని సమాచారం.

ఇక శాసనసభాపతి విషయంలోనూ అధిష్ఠానం తన నిర్ణయాన్ని వెల్లడించనున్నది. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం కిరణ్ మాత్రం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్ల సానుకూలంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో పీసీసీ అధ్యక్షపదవి విషయంలోనూ అధిష్ఠానం ఒక ఆలోచనకు వచ్చిందని చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షునిగా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పట్ల సీఎం సానుకూలంగా ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం ఉంది. కాగా ఈ పదవిలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేరు కూడా గట్టిగానే విన్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+