విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్స్ స్కామ్ ‌లో చండశాసనుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Andhra Jyothy
పోలీసు శాఖలో చండశాసనుడిగా పేరు పొందిన విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు సెక్స్ స్కామ్‌లో చిక్కుకున్నాడు. ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ బుధవారం ప్రసారం చేసింది. ఈ వార్తాకథనం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. అమ్మాయిలను వేధించడమే పనిగా సీతారామాంజనేయులు పనిచేస్తున్నారని ఆ వార్తాకథనం సారాంశం. ఏపియస్ - ది వుమనైజర్ శీర్షికన చానెల్ ఆ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. మహిళలపై సీతారామాంజనేయులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పడానికి కొన్ని రుజువులు కూడా ఆ చానెల్ చూపింది. కొంత మందికి సెల్ ద్వారా సీతారామాంజనేయులు పంపిన మెసేజ్‌లను చానెల్ బయటపెట్టింది. ఓ పారిశ్రామికవేత్త కూతురుకు వందల కొద్ది ఫోన్లు చేశాడని ఆరోపించింది. ఓ లేడీ డాక్టర్‌ను కూడా సీతారామాంజనేయులు వదలలేదని, ఓ కార్పొరేట్‌ కాలేజీ మహిళా లెక్చరర్‌ను కూడా వేధించాడని ఆ చానెల్ వ్యాఖ్యానించింది.

సీతారామాంజనేయలు పంపిన మెసేజ్‌ల్లో లైంగికపరమైన వ్యాఖ్యానాలు ఉన్న విషయాన్ని కూడా ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ఎత్తి చూపింది. ఒకేసారి ఐదారుగురు అమ్మాయిలను ట్రాప్ చేయడం సీతారామాంజనేయులుకు అలవాటు అని చెప్పింది. తన మెసేజ్‌లకు మహిళలు లేదా అమ్మాయిలు ప్రతిస్పందించకపోతే వారి ఇళ్లకే నేరుగా వెళ్లడం సీతారామాంజనేయలు చేసే పనిగా చెప్పింది. అమ్మాయిలను ట్రాప్ చేయడానికి తన వద్ద పనిచేసే ఎస్ఐలను కూడా ఆయన వాడుతారని విమర్శించింది. ఓ లేడీ డాక్టర్ వద్దకు సీతారామాంజనేయలు వెళ్లి వేధించాడని ఆరోపించింది.

ఈ వార్తాకథనాన్ని ప్రసారం చేసిన తర్వాత సీతారామాంజనేయులను ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడారు. దీని ప్రత్యక్ష ప్రసారాన్ని చానెల్ ప్రసారం చేసింది. రాధాకృష్ణ వేసిన ప్రశ్నలకు వేటికీ సీతారామాంజనేయులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. డయాబెటిక్ పేషెంట్‌గా మాత్రమే తాను డాక్టర్ వద్దకు వెళ్లానని, తనకూ డాక్టర్‌కూ మధ్య రోగీ డాక్టర్ సంబంధం మాత్రమే ఉందని సీతారామాంజనేయులు చెప్పారు. కార్పొరేట్ కాలేజీ లెక్చరర్ తనకు గతంలో రాఖీ కట్టిందని ఆయన చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కాగా, గతంలో ఈ విషయాలపై ఓ వ్యక్తి వేరే చానెల్ యజమాని వద్దకు వెళ్లాడని, ఆ చానెల్ యజమాని తనతో రాజీకి ప్రయత్నించాడని ఆయన చెప్పారు. ఆ వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీగా ఆయన తేల్చేశారు.

వల్లభనేని వంశీకి, సీతారామాంజనేయులుకు మధ్య వైరం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వంశీతో తాను గేమ్ ఆడానని, గత నాలుగు నెలలుగా ఆ గేమ్ ఆడుతున్నానని, ఇందులో భాగంగానే తాను మహిళలకు మెసేజ్‌లు పంపానని సీతారామాంజనేయులు బుకాయించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత నమ్రత అనే వైద్యురాలితో సీతారామాంజనేయలు లైవ్‌లో మాట్లాడారు. సీతారామాంజనేయులుపై ఆమె కూడా ఆరోపణలు చేశారు. మొత్తమ్మీద సీతారామాంజనేయులు చిక్కుల్లో పడినట్లే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X