రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు?

Telangana
రాష్ట్రపతి పాలన దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సకల జనుల సమ్మెను విరమించడానికి తెలంగాణవాదులు నిరాకరిస్తుండడంతో ప్రభుత్వానికి ఏమీ తోచని పరిస్థితి ఉంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా లేదు. ఒక రకంగా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించడానికే సిద్ధపడినట్లు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటు తెలంగాణ నాయకులు సమ్మె విరమణకు పిలుపునిచ్చే పరిస్థితి కూడా లేదు. సమ్మె విరమణకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు గానీ, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండారమ్ గానీ సమ్మెను విరమించాలని అడిగితే తెలంగాణ యావత్తూ తిరగబడే పరిస్థితి ఉంది. నిజానికి వారిద్దరు పులిపై స్వారీ చేస్తున్నారు.

తెలంగాణ సకల జనుల సమ్మె ఇప్పటికే 25 రోజులకు చేరుకుంది. సమ్మెను విరమింపజేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేసిన ఎత్తులేవీ ఫలించడం లేదు. సమ్మె వల్ల తెలంగాణ ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని, సమ్మెకు కోదండరామ్, కెసిఆర్ కారణమని ముఖ్యమంత్రి నిందించిన ప్రజలు వినడం లేదు. వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ నెల 9, 10, 11 తేదీల్లో మరోసారి తెలంగాణవాదులు రైల్ రోకోకు దిగుతున్నారు. విజయవాడకు, హైదరాబాదుకు మధ్య నడిచే బస్సులను తెలంగాణవాదులు ఆపేడయంతో తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై ఇటీవల తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

తెలంగాణ ఉద్యమకారుల్లోనే కాదు, తెలంగాణ సమ్మె వల్ల ఇబ్బందులు పడుతున్న సీమాంధ్రుల్లోనూ అసహనం పెరుగుతోంది. ఎంతగా అసహనం పెరిగినా, రాజకీయ నాయకుల నుంచి రెచ్చగొట్టే ప్రకటనలు వెలువడిన ఇప్పటి వరకు తెలంగాణ సకల జనుల సమ్మె ప్రశాంతంగానే జరుగుతోంది. కానీ పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కూడా లేదు. కాంగ్రెసు అధిష్టానం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతోంది. ఈ స్థితిలో రాష్ట్రపతి పాలన విధించి, పరిస్థితులను చక్కదిద్దడం మినహా మరో మార్గం లేదని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రపతి పాలన విధిస్తారని వస్తున్న వార్తలను గవర్నర్ నరసింహన్ ఖండించలేదు, సమర్థించనూ లేదు. దాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విషయంలో కేంద్రంలో ఓ ఆలోచన మాత్రం సాగుతుందని అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+