గండం గడిస్తే చాలు?: జగన్ వర్గంలో కలవరం

తాజాగా కాంగ్రెసు విప్ జారీ చేయడంతో ఈరోజు జరగనున్న జగన్ సమావేశానికి ఎందరు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు, ఎందరు ఆయన ఆజ్ఞను తిరస్కరిస్తారనే అంశం తేలనుంది. అయితే ఇప్పటి వరకు నోరు మెదపని ఇంకొందరు ఎమ్మెల్యేలు కూడా తాము ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని తేల్చి చెప్పే అవకాశాలు కొట్టి పారేయలేం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఎలాగూ లేవు. ఒకవేళ పడిపోవాలన్న జగన్ మరో పదిహేను నుండి ఇరవై మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను తన వైపు రప్పించుకోవాలి. తన నుండే ఎమ్మెల్యేలు జారిపోతున్న ఈ సమయంలో కాంగ్రెసు నుండి కొత్తగా వారిని రప్పించుకోవడం కుదరే పని కాదు.
ఇలాంటి పరిస్థితిల్లో విప్ కాదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే శాసనసభ్యత్వాలు రద్దవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు ఎదుర్కొనడం అంత వీజీ కాదు. అంతేకాకుండా కిరణ్ కూడా క్రమంగా పట్టు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ఉప ఎన్నికలు వచ్చినా లాభం చేకూరితే టిడిపికే అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. దీంతో జగన్ వైపు మనసు లాగే ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశాలున్నాయి. మొత్తానికి అవిశ్వాసం గండం గడిస్తే చాలని ఆ తర్వాతే జగనా? లేక కాంగ్రెసా? అనేది తేల్చుకోవచ్చుననే భావన ఆ ఎమ్మెల్యేల్లో ఉన్నట్లుగా ఉంది.












Click it and Unblock the Notifications