వేటుకు ముందే జగన్ ఉప ఎన్నికల ప్రచారం!

ఎలాగూ ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న జగన్ కాంగ్రెసు, టిడిపి కంటే ముందుగానే తన ఓదార్పులోనే ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గురువారం గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో పాల్గొన్న జగన్ ప్రాంతాల కోసం కుర్చీ కోసం ఉప ఎన్నికలు రావడం చూశామని, రాష్ట్ర చరిత్రలోనే కాదు కదా బహుశా దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా పేదవాని కోసం, రైతుల కోసం ఉప ఎన్నికలు రావడం మొట్టమొదటిసారిగా ఇప్పుడే చూస్తున్నామని, రైతులు, రైతు కూలీలు, ప్రతి పేదవాడి కోసం, విశ్వసనీయత, విలువల కోసం నిలబడి పదవులను త్యాగం చేసిన ప్రతి ఎమ్మెల్యేను ఆశీర్వదించండని కోరారు. ఉప ఎన్నికలతో ప్రజల్లోకి వెళ్లి, రాష్ట్రంలో రైతన్నలు పెడుతున్న కన్నీళ్లను, ప్రతి పేదవాడి కష్టాలను ఢిల్లీ పెద్దలకు వినిపిస్తామని చెప్పారు. తనతో వస్తున్న ఎమ్మెల్యేలను ఐదుకో, ఆరుకో కట్టడి చేయాలని బాబు, కిరణ్ చూశారని కాని వారికి బుద్ధి వచ్చేలా దేవుడు చూసుకుంటాడని చెప్పారు. జగన్ మాటలు చూస్తుంటే వేటు పడక ముందే ఉపఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications