వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హంద్రీ-నీవాలో సూరికి కోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Maddelacheruvu Suri
పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూరి, అతని అనుచరుడు భాను కిరణ్ రాష్టంలోని ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టినట్లు లేరు. తవ్వుతున్న కొద్దీ ఒక్కటొక్కటే వారి అరాచాకాలు బయటపడుతున్నాయి. తాజాగా రాయలసీమకు చెందిన హంద్రీ - నీవా సాగునీటి ప్రాజెక్టులో సూరి ప్రమేయం వెలుగు చూసింది. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు కమిషన్ల రూపంలో రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. సూరి ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ల నుంచి 20 కోట్ల రూపాయల మేరకు కమిషన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని సూరి జైలులో ఉండగానే నడిపినట్లు ప్రచారం జరుగుతోంది.

సూరి తరఫున భాను కిరణ్ ఆ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది. హంద్రీ - నీవా ప్రాజెక్టులో తాను పెట్టుబడులు పెట్టినట్లు సూరి ఒక సందర్బంలో మీడియాతో చెప్పారు. జైలులో ఉన్న సూరి ఆ ప్రాజెక్టులో పెట్టుబడులు ఎలా పెట్టారో ఎవరికీ తెలియదు. అయితే, కాంట్రాక్టుల నుంచి 8 నుంచి 10 శాతం కమిషన్లను సూరి ముఠా వసూలు చేసేదని అంటున్నారు. ఆ డబ్బులతో హైదరాబాదు, హైదరాబాదు పరిసరాల్లో భూములను కొనుగోలు చేసి వాటిని ఓ మహిళ పేరు మీద పెట్టినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ మహిళ ఎవరో భానుకు ఒక్కడికే తెలుసునని అంటున్నారు.

కాగా, పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఒక్కరొక్కరే హతమవుతున్నారు. 2005 జనవరి 24వ తేదీన పరిటాల రవి హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితులు మొద్దు శీను, పరిటాల రవి వంటి నిందితులు హతమయ్యారు. దీంతో పరిటాల రవి హత్య వాస్తవాలు కనుమరగయ్యే పరిస్థితి ఏర్పడింది. కేసును మూసివేసే పరిస్థితి కూడా రావచ్చునని అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణం నుంచి సూరి హత్య కేసును విచారించాలనే ఆలోచన కూడా పోలీసులకు రావడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X