మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెస్ శాసనసభ్యురాలు, ఇదివరకటి హీరోయిన్ జయసుధపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రం పని చేయనట్లుగా కనిపిస్తోంది. శుక్రవారం నుండి జగన్ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్సుపై ఫీజు పోరు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫీజు పోరుకు ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని కిరణ్‌కుమార్ రెడ్డి సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధను పిలిచి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశం సమయంలో కిరణ్, జయసుధతో భేటీ అయ్యారు.
జగన్ ఫీజు పోరు దీక్షలో పాల్గొనకూడదని ఆమెకు సూచించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోనే భవిష్యత్తు ఉంటుందని ఆమెకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కిరణ్ కోరికను భేఖాతరు చేస్తూ జయసుధ జగన్ ఫీజు పోరులో పాల్గొన్నారు. ఇదివరకు సైతం ముఖ్యమంత్రి జగన్ లక్ష్యదీక్ష, జలదీక్ష, జనదీక్ష తదితర కార్యాక్రమాలలో కూడా పాల్గొనవద్దని ఎమ్మెల్యేలను కోరినప్పటికీ అంతగా ఫలించలేదు.
Secunderabad MLA Jayasudha did not cared CM Kirankumar Reddy's urge. He urged her yesterday, to dont participate in Ex MP YS Jaganmohan Reddy Fee Poru. But she was participated.
Story first published: Saturday, February 19, 2011, 13:23 [IST]