• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిఖిత ఎపిసోడ్: భామలంటే అలుసే

By Pratap
|

Nikitha
కన్నడ సినిమా పరిశ్రమలో నటి నిఖిత ఎపిసోడ్ కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. యాక్షన్ హీరో దర్శన్ తన భార్య విజయలక్ష్మిని చితకబాదిన కేసులో నిఖిత జీవితం రోడ్డున పడింది. దర్శన్‌తో నిఖిత ప్రేమాయణమే పరిణామాలకు కారమంటూ కన్నడ సినీ పరిశ్రమ నెత్తీనోరూ బాదుకుంది. ట్రయాంగిల్ కథలో నిఖిత తీవ్రంగా నష్టపోయింది. పైగా, కన్నడ సినిమా నుంచి నిఖితను మూడేళ్లు నిషేధం విధిస్తూ కన్నడ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ సినీ పరిశ్రమలోని లైంగిక వివక్ష కొట్టొచ్చినట్లు కనిపించింది.

నిఖిత వ్యవహారమే కాదు, మొదటి నుంచీ దక్షిణ భారత సినిమాల్లో మహిళా నటుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మంచికంతా హీరోలు, చెడుకంతా హీరోయిన్లు కారణమనే భావజాలం నిండా పరుచుకుని ఉంది. 2005లో ఖుష్బూ చేసిన వ్యాఖ్యలకు కన్నడ సినిమా ప్రతిస్పందన కూడా ఆ వ్యవహారాన్నే బయటపెట్టింది. వివాహానికి ముందు సెక్స్‌లో పాల్గొనే అమ్మాయిలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఖుష్బూ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఖుష్బూపై దుమ్మెత్తిపోశారు.

ప్రముఖ రచయిత, దర్శకుడు నగతిహళ్లి చంద్రశేఖర్ నూరు జన్ముక్కు సినిమా షూటింగ్ సందర్భంగా 2009లో కన్నడ నటి అయింద్రతను కొట్టినట్లు వార్తలు వచ్చాయి. నీ ఇల్లదే సినిమా నిర్మాత తనకు 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని చెప్పినందుకు పూజా గాంధీ కన్నడ సినిమా నిర్మాతల మండలికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిషేధం విధిస్తామని నిర్మాతల మండలి ఆమెను బెదిరించింది. ఈ ఏడాది మార్చిలో క్రమశిక్షణారాహిత్యం పేరు చెప్పి రమ్యపై ఏడాది పాటు నిషేధం విధించారు.

తెలుగు సినిమా పరిస్థితి కూడా అంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. హీరోయిన్ ఎంపిక జరగకుండానే షూటింగుల ముహూర్తాలు తెలుగులో జరిగిపోతాయి. అంటే, సినిమాలో హీరోయిన్ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం ఉండదనేది చెప్పనవసరం లేదు. అంగాంగ ప్రదర్శన చేయడానికి, హీరోతో ఆరు పాటల్లో స్టెప్పులేయడానికి మాత్రమే తెలుగులో హీరోయిన్ పాత్ర పనికి వస్తుంది. అయితే, సినిమా బాక్సాఫీసు వద్ద బోర్లా పడితే మాత్రం ఆ భారాన్ని హీరోయిన్ మోయాల్సి వస్తుంది. హీరోకు తగిన జంట కాదని హీరోయిన్‌పై ప్రచారం మొదలు పెడతారు. రామ్‌చరణ్ తేజ చిరుత సినిమాలో నటించిన నేహాను గుర్తించేవారే లేకుండా పోయారు. అపజయానికి ఆమెను బాధ్యురాలిని చేశారు. ఇటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. షూటింగుల సమయంలో హీరోకు కల్పించిన సౌకర్యాలు హీరోయిన్‌కు ఉండవు.

తమిళంలో మాత్రం పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉంది. పురుష ప్రధానమైన, పురుషాధిపత్య సినిమాలే తమిళంలో వస్తున్నప్పటికీ హీరోయిన్‌కు కాస్తా గౌరవమర్యాదలు దక్కుతున్నాయి. మలయాళంలో రెమ్యూనిరేషన్ చెల్లింపు విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతోంది. మొత్తం మీద, దక్షిణాదిలో మహిళ ప్రాధాన్య పాత్రలతో సినిమాలు తక్కువే. వాటిని వేళ్ల మీద లెక్కించవచ్చు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is evident that gender bias is seen clearly South film industry. Nikita's episode is fresh example for that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more