అంబటి రాయుడి దశ తిరిగిందా?

 Ambati Rayudu
బ్యాటింగులో మణికట్టు మాయాజాలానికి పేరొందిన హైదరాబాదు క్రీడాకారుడు అంబటి తిరుపతి రాయుడి దశ తిరిగినట్లే ఉంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేతిలో పడడంతో అతనికి మంచి కాలం వచ్చినట్లే చెప్పుకోవచ్చు. అంబటి రాయుడి గురించి తాను 2002లో వివియస్ లక్ష్మణ్ ద్వారా విన్నానని సచిన్ చెప్పాడు. రాయుడి గురించి చాలా విన్నానని, ఇప్పుడు తెలుసుకున్నానని ఆయన అన్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు అంబటి రాయుడు అంధకారంలో మగ్గాడనే చెప్పవచ్చు. ముంబై ఇండియన్స్ జట్టు అతని ప్రతిభను వాడుకోవడం ప్రారంభించింది.

హైదరాబాదు నుంచి ముంబైకి అతని ప్రయాణం చాలా విచిత్రంగానే జరిగింది. కోచ్‌తో గొడవలు, ఐసియల్‍‌కు వెళ్లడం, గాయాలు వంటి కారణాలతో రాయుడు దాదాపుగా ఏమీ కాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో ముంబై ఇండియన్స్ జట్టులో అతనికి స్థానం దక్కింది. దాంతో అంబటి రాయుడు అంటే ఏమిటో క్రికెట్ ప్రపంచానికే కాదు, ప్రపంచ క్రికెట్ అభిమానులకు కూడా తెలిసి వస్తోంది.

ముంబైకి రావడం, సచిన్‌తో కలిసి ఆడడం అద్భుతమైన విషయంగానే ఉందని రాయుడు అంటాడు. ఈ అవకాశం అతనికి మిగతా జీవితమంతా ఉపయోగపడుతుందని అతనికి తెలుసు. ముంబై ఇండియన్స్ మెటంర్ షాన్ పొలాక్, కోచ్ రాబిన్ సింగ్, జట్టు సహచరులు, ప్రత్యర్థి జట్ల సభ్యులు - రాయుడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. సచిన్ టెండూల్కర్ ఏకంగా తనకు లభించిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచును రాయుడితో పంచుకున్నాడు. రాయుడు బాగా ఆడుతున్నాడని, అతను ప్రతిభావంతుడని చెప్పడంలో సందేహం లేదని, అతను ఇలాగే ఆడుతాడి ఆశిస్తున్నానని పొలాక్ అన్నాడు. రాయుడి వద్ద మంచి టెక్నిక్‌తో పాటు స్ట్రోక్స్ ఆడే నేర్పు ఉంది. అది అతన్ని మంచి బ్యాట్స్‌మన్‌గా నిలబెడుతుంది. వికెట్ కీపర్‌గా కూడా వ్యవహరించగలడు. రాబిన్ ఉతప్ప, శిఖర్ ధావన్, దినేష్ కార్తిక్, పార్థివ్ పటేల్ వంటి తన అండర్ 19 జట్టు సహచరులు ఏదో ఒక సమయంలో జాతీయ జట్టులో ఆడారు. అంబటి రాయుడు అంత ప్రతిభ ఉన్నప్పటికీ ఆ అదృష్టాన్ని దక్కించుకోలేకపోయాడు.

అండర్ 19 క్రికెట్‌లో రాయుడి ప్రతిభ ఎప్పటికప్పుడు బయటపడుతూనే వచ్చింది. రంజీ ట్రోఫీ కెరీర్‌లో డబుల్ సెంచరీ, అదే మ్యాచులో సెంచరీ చేసిన సంఘటన ఉంది. 2002లో అండర్ 19 జట్టు కెప్టెన్‌గా కూడా చేశాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఐపియల్‌లో ఆడుతున్న అంబటి రాయుడు తప్పకుండా జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడుతాడని ఆశించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+