వన్డేలకు సచిన్ రాంరాం?

Sachin Tendulkar
వన్డే క్రికెట్ నుంచి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తప్పుకుంటారా అనే చర్చ జోరుగా సాగుతోంది. 38 ఏళ్ల పడిలో పడిన సచిన్ టెండూల్కర్ ఇక ఏ మాత్రం వన్డేలు ఆడలేడని అంటున్నారు. అయితే, వందో సెంచరీ పూర్తి చేయాల్సి ఉంది. వందో సెంచరీ సాధించేదాకా ఆగుతాడా, ఇప్పుడే వన్డేల నుంచి రిటైర్ అవుతాడా అనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2015లో జరిగే ప్రపంచ కప్ పోటీల్లో కూడా ఆడుతారా అని అడిగితే ప్రస్తుత విజయాన్ని పూర్తిగా అస్వాదించనీయండని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అంతేకాదు, తన భవిష్యత్తుపై ఊహాగానాలు వద్దని కూడా ఆయన సలహా ఇచ్చారు. నిజానికి, ఫామ్ కోల్పోయిన ప్రతిసారీ సచిన్ టెండూల్కర్ తీవ్ర విమర్శలను ఎదుర్కుంటూనే ఉన్నారు. ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలు వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

యువ క్రికెటర్లకు అవకాశం లబించకుండా జట్టును పట్టుకుని వేలాడుతున్నాడనే విమర్శలను సచిన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. వయస్సు మీద పడుతుంటే సాహసాలు చేయకూడదని ఆయన భావించే వీలుంది. వన్డేలకు స్వస్తి చెప్పి టెస్టు క్రికెట్‌లో ప్రస్తుతం కొనసాగవచ్చునని అంటున్నారు. ముంబై వేదికగా ప్రపంచ కప్ గెలుచుకున్న ఆనందంలో సచిన్ టెండూల్కర్ ఉన్నారు. తద్వారా సచిన్ ప్రపంచ కప్ కల నెరవేరింది. జట్టు సభ్యులు కూడా సచిన్‌కు ఎంతో గౌరవం ఇచ్చారు. వారి ప్రతి మాటలోనూ సచిన్ పేరునే వల్లె వేశారు. ఇదంతా సచిన్‌కు ఓ తీపి గుర్తు. దీన్ని ఆయన ప్రజలతో పంచుకోవాలని అనుకుంటున్నారు. ఇంతగా ప్రజల ఆదరణను, జట్టు సభ్యుల గౌరవ మర్యాదలను అందుకున్న సచిన్ టెండూల్కర్ ఈ మధుర స్మృతుల మధ్యనే వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవచ్చునని అంటన్నారు.

నిజానికి, సచిన్ టెండూల్కర్ ప్రపంచ కప్ పోటీల్లో కూడా కుర్రాళ్లతో పోటీ పడ్డారు. తగిన పరుగులు సాధించాడు. ఆయన ప్రశంసలే తప్ప విమర్శలను ఎదుర్కోలేదు. అయితే, ఈ జోరును సచిన్ ఎంత కాలం కొనసాగించగలరనేది ప్రశ్న. పటిమ తగ్గి ఆటలో పస తగ్గే ప్రమాదం లేకపోలేదు. ఆటలో విఫలమవుతూ వస్తే ఇప్పుడు బ్రహ్మరథం పట్టిన ప్రజలే విమర్శలకు పూనుకోవచ్చు. విసుగు ప్రదర్సించవచ్చు. 1983లో ప్రపంచ కప్ అందించిన కపిల్ దేవ్‌కు కూడా అటువంటి స్థితి తప్పలేదు. అందువల్ల ప్రజాదరణ మెండుగా ఉన్నప్పుడే తప్పుకుంటే బాగుంటుందని సచిన్ భావిస్తూ ఉండవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+